Minister Gangula On ED Raids : ఇంటి తాళాలు పగలగొట్టాలని నేనే చెప్పా.. ఈడీ, ఐటీ దాడులపై మంత్రి గంగుల రియాక్షన్

తన ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తన ఇంటి తాళాలు పగలగొట్టాలని తానే అధికారులకు చెప్పానన్నారు.

Minister Gangula On ED Raids : తన ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తన ఇంటి తాళాలు పగలగొట్టాలని తానే అధికారులకు చెప్పానన్నారు. వీడియో కాల్ లో ఉండి లాకర్లను కూడా తానే తెరిపించానన్నారు మంత్రి గంగుల కమలాకర్. అయితే ఎంత డబ్బు దొరికింది? ఆస్తుల పత్రాలు ఏం దొరికాయి? అనేది ఈడీ, ఐటీ అధికారులే చెప్పాలన్నారు మంత్రి గంగుల.

తాను ఫెమా నిబంధనలను ఉల్లంఘించలేదని, ఈడీ అధికారులు ఎందుకొచ్చారో తనకు అర్థం కావడం లేదన్నారు మంత్రి గంగుల. ఈడీ, ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. అధికారులకు సహకరించేందుకే.. దుబాయ్ కి వెళ్లిన 17గంటల్లో తిరిగి వచ్చేశానన్నారు. తన గ్రానైట్ కంపెనీలపై చాలా ఏళ్లుగా ఫిర్యాదు చేస్తున్నారని గంగుల ఆరోపించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్.. ఈడీ, ఐటీ సోదాల విషయం తెలియగానే తిరుగు పయనం అయ్యారు. బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈడీ దాడుల నేపథ్యంలో అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని వచ్చేసిన మంత్రి గంగుల.. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని తేల్చి చెప్పారు. అందుకోసమే దుబాయ్ నుంచి తిరిగొచ్చానన్నారు. కాగా, ఈ కేసులో ఈడీకి ఏం సంబంధమో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

ఇక కరీంనగర్ లో గ్రానైట్ సంస్థల ఆఫీసుల్లో బుధవారం ఉదయం నుంచి జరుగుతున్న ఈడీ, ఐటీ సోదాలు రాత్రి 8.30 గంటలకు కొలిక్కి వచ్చాయి. దాదాపు 10 గంటల పాటు కొనసాగిన సోదాల్లో అధికారులు కీలక డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మంత్రి గంగుల ఇంట్లో కూడా ఈడీ, ఐటీ సోదాలు ముగిశాయి. మంత్రి ఇంటి నుంచి కీలక పత్రాలు, ఇతర ఆధారాలను అధికారులు తీసుకెళ్లినట్లు సమాచారం.

 

 

 

ట్రెండింగ్ వార్తలు