Harish Rao : దేశానికి ఆదర్శంగా తెలంగాణ వైద్య రంగం : మంత్రి హరీష్ రావు

అంబులెన్స్ లు 316 ఉన్నవాటిని 455కి పెంచామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30శాతం ఉన్న దాన్ని 70శాతం పెంచుకున్నామని తెలిపారు. తల్లి మరణాలు, శిశు మరణాలు గణనీయంగా తగ్గించామని పేర్కొన్నారు.

Minister Harish Rao (2)

Harish Rao – Health Department Progress : తెలంగాణ వైద్య రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగలు వేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యం విషయంలో దేశంలో రాష్ట్రం 3వ స్థానంలోకి ఉందని అన్నారు. సోమవారం హరీష్ రావు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ వైద్య ఆరోగ్య ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఆరోగ్యం విషయంలో దేశంలో రాష్ట్రం 3వ స్థానంలోకి ఉందని తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా 310మంది ఫార్మసీస్టులకు నియామక పత్రాలు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఫ్యామిలీలోకి మీ అందరికీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికి రాదు మీకు ఆ అవకాశం వచ్చిందన్నారు. రోజూ కొన్ని వందల మందికి మందులు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. మీరు మంచిగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. తొమ్మిదేళ్లలో 22వేల 600 మందికి ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. మరో 7వేల91 మందికి ఉద్యోగ నియామకాలు తుది రూపంలో ఉన్నాయని తెలిపారు. స్టాఫ్ నర్స్ లకు కూడా త్వరలో నియామక పత్రాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు.

Harish Rao : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ.. పేద ప్రజల ఇంటి కలను కేసీఆర్ నిజం చేశారు : మంత్రి హరీష్ రావు

తాము పదేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేశామని తెలిపారు. 2014లో దేశంలో రాష్ట్రం 11వ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పుడు 3వ స్థానంలోకి వచ్చాం.. అయినా ఆగడం లేదు మొదటి స్థానానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. శాఖలో ప్రతి ఒక్కరి సహకారంతో ఈ స్థానానికి వచ్చామని పేర్కొన్నారు. గతంలో తలసరి ఆరోగ్య బడ్జెట్ ఒక మనిషికి 925రూపాయలు ఉందని ఇప్పుడు 3532రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.

సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ లను వాటిల్లో పడకలను పెంచుకుంటున్నామని పేర్కొన్నారు. ‘నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకి అనే నానుడి నుంచి పోదాం పద బిడ్డా సర్కార్ దవాఖానకి అన్నట్టు అయ్యింది’ అని అన్నారు. ఒకప్పుడు 1400 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే ఈ రోజు 34వేలకు పెంచుకున్నామని తెలిపారు. వైద్య కళాశాలలు 20 ఉంటే ఇప్పుడు 56కి పెంచామని చెప్పారు. నర్సింగ్ కాలేజీలు 74 ఉంటే 106కి పెంచుకున్నామని పేర్కొన్నారు. ఎంబీబీఎస్ సీట్లు 2850 ఉంటే వాటిని 3రెట్లు పెంచుతూ 8515 సీట్లు చేసుకున్నామని తెలిపారు.

V. Hanumantha Rao : రాహుల్ గాంధీని హైదరాబాద్ లో పోటీ చేయాలంటున్న అసదుద్దీన్ కేరళలో పోటీ చేస్తారా? : వి.హనుమంతరావు

డయాలసిస్ కేంద్రాలు 3 ఉంటే ఇప్పుడు 82కి పెంచామని వివరించారు. ఐసీయూ 5 ఉండే రాష్ట్రంలో ఇప్పుడు 75 ఐసీయూలను ఏర్పాటు చేసి 80కి పెంచుకున్నామని తెలిపారు. అంబులెన్స్ లు 316 ఉన్నవాటిని 455కి పెంచామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30శాతం ఉన్న దాన్ని 70శాతం పెంచుకున్నామని తెలిపారు. తల్లి మరణాలు, శిశు మరణాలు గణనీయంగా తగ్గించామని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు