Revanth Reddy: సెక్యూరిటీ లేకుండా కేసీఆర్ అక్కడకు రాగలరా?: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కి తగినంత భద్రత కల్పించామని చెప్పారు.

Revanth Reddy

Revanth Reddy – KCR: కోర్టు చెప్పినా ప్రభుత్వం తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వెళ్తారని అన్నారు. మరి సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా(OU), కాకతీయ (KU) యూనివర్సిటీలకు కేసీఆర్ రాగలరా అని నిలదీశారు.

తాను ఎంపీగా ఉన్నప్పటికీ, జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ భద్రతను తొలగించడం ఏంటని రేవంత్ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కి తగినంత భద్రత కల్పించామని చెప్పారు. తాను ప్రజల మనిషినని, తనకు సెక్యూరిటితో పనిలేదని చెప్పారు తనను ఓడించడానికి కేసీఆర్ పోలీసులను వాడుకున్నారని చెప్పారు.

తనకు లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలే సైన్యమని, తనకు వారే సెక్యూరిటీ అని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల వేళ పొత్తుల విషయంపై రేవంత్ రెడ్డి స్పందించారు. సమయం వచ్చినప్పుడు దాని గురించి ఏఐసీసీ చూసుకుంటుందని చెప్పారు. తమ పార్టీలో మెజార్టీ, మైనార్టీ అనే తేడా ఉండదని అన్నారు. తమ పార్టీలో మైనార్టీలు ఉన్నతస్థానాల్లో ఉన్నారని చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీ మైనార్టీల కోసం ఏమీ చేయలేదని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పారు. బీజేపీ తెచ్చిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకీ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. కోకాపేట, బుద్వేల్లో భూములు కొన్న సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఆ ప్రాంతాల్లో భూములు కొన్నది బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ బీనామీలేనని చెప్పారు.

Yarlagadda Venkata Rao: యార్లగడ్డ వెంకట్రావు సంచలన నిర్ణయం.. వైసీపీకి గుడ్ బై చెప్పి, చంద్రబాబు వద్దకు..

ట్రెండింగ్ వార్తలు