Elon Musk : న్యూరాలింక్ మరో సరికొత్త ప్రయోగం.. పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోయే సమస్యలను పరిష్కరించే డివైజ్..!

Elon Musk Neuralink : నోలాండ్ అర్బాగ్ అనే అరిజోనా వ్యక్తిలో మెదడు చిప్ ఇంప్లాంటేషన్ గురించి మాట్లాడుతూ.. మస్క్ బృందం ఎదుర్కొన్న సవాళ్లను గుర్తించి భవిష్యత్ శస్త్రచికిత్సలలో ఈ అడ్డంకులను అధిగమించడానికి వ్యూహాన్ని వివరించారు.

Elon Musk Neuralink to help fix paralysis and memory ( Image Source : Google )

Elon Musk Neuralink : ప్రముఖ టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ స్థాపించిన బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ స్టార్టప్ న్యూరాలింక్ రాబోయే వారంలో రెండో వ్యక్తికి బ్రెయిన్ చిప్ డివైజ్ అమర్చడానికి సిద్ధంగా ఉంది. మానవ మేధస్సును డిజిటల్ టెక్నాలజీతో కలపడానికి మరో పెద్ద అడుగును సూచిస్తుంది. మస్క్ ఈ ప్రణాళికలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ (X) వేదికగా ప్రకటించాడు. అంతేకాదు.. ఈ ఏడాది చివరిలోగా రోగుల “అధిక సింగిల్ డిజిట్స్”లో డివైజ్‌లను అమర్చాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కూడా షేర్ చేశాడు.

Read Also : Elon Musk Omelettes : అలా అయితే.. వారం పాటు ఆమ్లెట్ తినడమే మానేస్తా: మస్క్‌ మామ!

ఎలన్ మస్క్, కీలకమైన న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్‌లు మెదడు చిప్ డివైజ్ సామర్థ్యాలు, భవిష్యత్తు సామర్థ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి తీవ్రమైన నాడీ సంబంధిత పరిస్థితులను పరిష్కరించడంలో డివైజ్ సామర్థ్యాన్ని హైలైట్ చేశారు. వ్యక్తులకు అసాధారణ సామర్థ్యాలను అందించడంతో పాటు ఏఐ మానవ పరస్పర చర్యను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

మెదడు కణజాలంపై చిప్ ప్లేస్‌మెంట్ :
నోలాండ్ అర్బాగ్ అనే అరిజోనా వ్యక్తిలో మెదడు చిప్ ఇంప్లాంటేషన్ గురించి మాట్లాడుతూ.. మస్క్ బృందం ఎదుర్కొన్న సవాళ్లను గుర్తించి భవిష్యత్ శస్త్రచికిత్సలలో ఈ అడ్డంకులను అధిగమించడానికి వ్యూహాన్ని వివరించారు. మెదడు కణజాలం నుంచి ఎలక్ట్రోడ్ థ్రెడ్‌లు వరకు ఎదుర్కొన్న ప్రాథమిక సమస్యలలో ఒకటిగా చెప్పవచ్చు. మెదడు మడతలపై మరింత కచ్చితమైన ప్లేస్‌మెంట్ ఉండేలా చొప్పించే ప్రక్రియను మెరుగుపరచాలని న్యూరాలింక్ యోచిస్తోంది. తద్వారా డివైజ్ పర్ఫార్మెన్స్ మెరుగుపరుస్తుంది.

ఈ సాంకేతిక పురోగతులతో పాటు, న్యూరాలింక్ జంతు పరీక్షా విధానాలకు సంబంధించిన నైతిక పరిశీలనలపై మస్క్ భరోసా ఇచ్చారు. జంతువుల సంక్షేమాన్ని పెంచడానికి నిజంగా చేయగలిగినదంతా చేస్తామని పేర్కొంటూ, జంతు సంక్షేమానికి కంపెనీ నిబద్ధతను నొక్కి చెప్పాడు. న్యూరాలింక్ టెక్నాలజీ అభివృద్ధిని మస్క్ సూచించాడు.

మెదడు చిప్ అప్‌గ్రేడ్‌లను స్మార్ట్‌ఫోన్ పురోగతితో పోల్చాడు. మీకు ఐఫోన్ 15 కావాలి గానీ ఐఫోన్ 1 కాదంటూ మస్క్ చమత్కరించాడు. ఈ ఐఫోన్ భవిష్యత్తు తరాలు గణనీయమైన అప్‌గ్రేడ్ అందిస్తాయని పాత మోడళ్లతో ఉన్న కొత్త వెర్షన్‌లకు అప్‌గ్రేడ్ చేయవచ్చని సూచించారు.

Read Also : Redmi K70 Ultra : ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రెడ్‌మి K70 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. జూలై 18నే రిలీజ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు