Shubman Gill : అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు.. కెప్టెన్‌గా గిల్ వేస్ట్.. అతడిలో నాయకత్వ లక్షణాలు లేవబ్బా..
టీమ్ఇండియా భవిష్యత్తు కెప్టెన్ గిల్ అని పలువురు క్రీడా పండితులు చెబుతుండగా టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 16, 2024 / 03:14 PM IST
Shubman Gill has no idea about captaincy says Amit Mishra
Shubman Gill – Amit Mishra : టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు జింబాబ్వే పర్యటనలో అదరగొట్టింది. తొలి టీ20 మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి 5 మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో గిల్ కెప్టెన్సీ పై సర్వత్రా ప్రసంశల వర్షం కురుస్తోంది. టీమ్ఇండియా భవిష్యత్తు కెప్టెన్ గిల్ అని పలువురు క్రీడా పండితులు చెబుతుండగా టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కెప్టెన్‌గా గిల్ పనికిరాడని అన్నారు. అతడిలో నాయకత్వ లక్షణాలు ఏమీ లేవన్నాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తారా అనే ప్రశ్నకు అమిత్ మిశ్రా ఈ విధంగా స్పందించాడు.
IND vs SL : ఇక చాలు.. మీ ముగ్గురు ఆడాల్సిందే.. కోహ్లీ, రోహిత్, బుమ్రాలతో గంభీర్..!
‘నేను అతడిని కెప్టెన్‌గా అస్సలు ఎంపిక చేయను. ఐపీఎల్లో అతడి కెప్టెన్సీ దగ్గరనుండి చూశాను. కెప్టెన్‌గా ఎలా వ్యవహరించాలో అతడికి తెలియదు. అతడిలో నాయకత్వ లక్షణాలు లేవు. అతడు భారత జట్టులో భాగమైనందున కెప్టెన్‌గా చేయకూడదు.’ అని మిశ్రా అన్నాడు.
హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్‌కి ట్రేడింగ్‌లో బదిలీ కావడంతో ఐపీఎల్ 2024 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలో గుజరాత్ 14 మ్యాచులు ఆడింది. కేవలం ఐదు మ్యాచుల్లోనే విజయం సాధించింది. మిగిలిన 9 మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో సెమీ ఫైనల్ చేరకుండానే గ్రూప్ స్టేజీ నుంచే నిష్ర్కమించింది.
Rishabh Pant : ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకివ్వనున్న రిషబ్ పంత్..?
