Hardik Pandya : ముంబైకి హార్దిక్ పాండ్యా గుడ్‌బై..! KKR భారీ ప్లాన్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లతో బిగ్ డీల్.. రంగంలోకి CSK..?
Hardik Pandya : ఐపీఎల్ -2027 సీజన్‌కు ముందే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టును వీడి.. కొత్త జట్టులోకి వెళ్తబోతున్నట్లు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర జరుగుతుంది.
Hardik Pandya
Hardik Pandya : ఐపీఎల్ -2027 సీజన్‌కు ముందే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టును వీడి.. కొత్త జట్టులోకి వెళ్తబోతున్నట్లు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. తన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో హార్దిక్‌ను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్న వేళ.. హార్దిక్‌ను కొనుగోలు చేసేందుకు పలు ప్రాంచైజీలు పోటీ పడుతున్నట్లు సమాచారం.
Also Read : IND vs NZ : భారత జట్టు వరల్డ్ రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి టీంగా గుర్తింపు..
హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి వెనక్కి తగ్గిన కోల్‌కతా ఫ్రాంచైజీ.. ఇప్పుడు మరోసారి హార్దిక్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే, ఈ ట్రేడ్‌కు ముంబై ఇండియన్స్ విధిస్తున్న షరతులు అడ్డంకిగా మారుతున్నాయి.
ఐపీఎల్ 2027కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం జట్టులో కీలక మార్పులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అజింక్య రహానే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టులో నాయకత్వ సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన కెప్టెన్ కోసం ఆ జట్టు యాజమాన్యం వెతుకులాట ప్రారంభించింది. ఈ క్రమంలో హార్ధిక్ పాండ్యాను జట్టులోకి తీసుకొని.. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేలా ప్లాన్ చేస్తుందట.
హార్దిక్ పాండ్యాను కోల్‌కతాకు పంపేందుకు ముంబై ఇండియన్స్ కొన్ని కీలక షరతులు విధించినట్లు సమాచారం. ముఖ్యమంగా కకోల్కతా నైట్‌రైడర్స్ జట్టులోని హర్షిత్ రాణా, యువ బ్యాటర్ అంగ్ క్రిష్ రఘువంశీలను తమకు ఇవ్వాలని ముంబై కోరుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముంబైకి భారత వికెట్ కీపర్ అవసరం ఉండటంతో దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న రఘువంశీపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అతన్ని వదులుకునేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సముఖంగా లేదు. అయితే, మరికొద్దిరోజుల్లో ఇరు జట్ల యాజమాన్యాల మధ్య చర్చలు జరగబోతున్నాయని.. హార్డిక్ పాండ్యా కేకేఆర్ జట్టులోకి వెళ్లడం ఖాయమనే చర్చ జరుగుతుంది.
హార్డిక్ పాండ్యా కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యాజమాన్యం కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే, హార్దిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం CSKలో తక్కువగా ఉండటంతో ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లడం కష్టంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది. అంతకంటే ముందుగా నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువులోపే హార్దిక్ పాండ్యా ట్రేడ్ వ్యవహారాన్ని తేల్చుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కోల్‌కతాకు మారడం ఖరారు కాలేదు. ముఖ్యంగా హర్షిత్ రాణా, అంగ్క్రిష్ రఘువంశీలను వదులుకునే విషయంలో కేకేఆర్ తీసుకునే నిర్ణయంపైనే ఈ డీల్ ఆధారపడి ఉండనుంది. మరి ఐపీఎల్ 2027లో హార్దిక్ కొత్త జెర్సీలో కనిపిస్తాడా? లేదా ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగుతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
