Flipkart Mega Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా అనేక డివైజ్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. మెగా సేల్ సమయంలో ఐఫోన్ 15 భారీ తగ్గింపు అందిస్తోంది.
ఎలాంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా ఐఫోన్ ధరను రూ. 10వేల కన్నా తగ్గింపు ధరకే పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 40 నియో, ఐఫోన్ 13, పిక్సెల్ 8 మరిన్ని వంటి డివైజ్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు పొందాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్.. భారీ డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 భారీ తగ్గింపు ఆఫర్‌తో విక్రయిస్తోంది. ఈ డివైజ్ ఎలాంటి బ్యాంక్ కార్డ్‌లు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లేకుండా కేవలం రూ. 65,999 వద్ద అందిస్తోంది. ప్రాథమికంగా యూజర్లు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 13,901 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. సైట్లో ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐఫోన్ 15ని మరింత తక్కువ ధరకు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 50వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు.
మీ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ మొత్తం పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎప్పుడూ పూర్తి తగ్గింపు ఆఫర్ ఇవ్వదని గమనించాలి. ఐఫోన్ 15ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన డీల్స్ పొందాలంటే.. ఆపిల్ ఐఫోన్ 13ని రూ. 52,999కి కొనుగోలు చేయొచ్చు. అద్భుతమైన కెమెరా పనితీరు, క్లీన్ సాఫ్ట్వేర్ కోరుకునే యూజర్లు పిక్సెల్ 8ని రూ. 69,999కి కొనుగోలు చేయవచ్చు.
అయితే, ఈ ఫోన్ అసలు ధర రూ. 75,999గా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 40 నియో కూడా తక్కువ ధరకే పొందవచ్చు. కొన్ని బ్యాంక్ ఆఫర్లపై అదనంగా రూ. 2వేల తగ్గింపు పొందవచ్చు. పోకో ఎమ్6 ప్రో ధర రూ. 9,999, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్ ధర రూ. 12,490 వద్ద అమ్మకానికి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.22,999 ఉండగా ధర రూ. వెయ్యికి తగ్గింది.
Read Also : Apple Watch Series 9 : క్రోమాలో ఆపిల్ వాచ్ సిరీస్ 9పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకే పొందాలంటే?