Honor Magic V3 : హానర్ నుంచి సరికొత్త మ్యాజిక్ వి3 మడతబెట్టే ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. గ్లోబల్ లాంచ్ ఎప్పుడంటే?

Honor Magic V3 Launch : ఈ హ్యాండ్‌సెట్ ఇతర మార్కెట్లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మ్యాజిక్ V3 ఫోల్డబుల్ ఫోన్‌ను అదే స్పెసిఫికేషన్‌లతో విభిన్న మార్కెట్లో కూడా అందించే అవకాశం ఉంది.

Honor Magic V3 Global Model Listed on Geekbench ( Image Source : Google )

Honor Magic V3 Launch : ప్రముఖ హానర్ కంపెనీ నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ రాబోతోంది. హానర్ మ్యాజిక్ వి3 నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్‌ గత జూలైలో కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. అయితే, త్వరలో గ్లోబల్ మార్కెట్‌లలో కూడా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ పర్ఫార్మెన్స్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో గుర్తించారు. ఈ హ్యాండ్‌సెట్ ఇతర మార్కెట్లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మ్యాజిక్ V3 ఫోల్డబుల్ ఫోన్‌ను అదే స్పెసిఫికేషన్‌లతో విభిన్న మార్కెట్లో కూడా అందించే అవకాశం ఉంది.

Read Also : iPhone 16 Pro Series : భారీ బ్యాటరీతో ఐఫోన్ 16 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు లీక్.. లాంచ్ ఎప్పుడు ఉండొచ్చుంటే?

మోడల్ నంబర్ “ఎఫ్‌సీపీ-ఎన్49″తో ఉన్న డివైజ్ జాబితాను గీక్‌బెంచ్‌లో మైస్మార్ట్‌ప్రైస్ గుర్తించింది. సింగిల్-కోర్ పరీక్షలో 1,914 పాయింట్లు, 5,354 పాయింట్లను స్కోర్ చేసిన ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో డివైజ్ అమర్చినట్టు ఎంట్రీ వెల్లడించింది. ప్రైమ్ కోర్ లిస్టింగ్ ప్రకారం.. మల్టీ-కోర్ టెస్ట్‌లో చిప్‌సెట్ 3.30GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌ని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ అడ్రినో 750 జీపీయూతో అమర్చి ఉంటుంది.

బెంచ్‌మార్క్ నంబర్‌లు, సీపీయూ ఫ్రీక్వెన్సీ, జీపీయూ సమాచారం హానర్ మ్యాజిక్ వి3 స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని సూచిస్తున్నాయి. 12జీబీ ర్యామ్ ఫీచర్‌తో వస్తుంది. గీక్‌బెంచ్‌లోని ఎంట్రీ మోడల్ నంబర్ ఎఫ్‌సీపీ-ఎన్49తో హ్యాండ్‌సెట్ పేరును నేరుగా వెల్లడించనప్పటికీ, హానర్ మ్యాజిక్ వి3తో కూడిన టెలికమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) జాబితాలో అదే మోడల్ నంబర్ కలిగి ఉందని నివేదిక పేర్కొంది. ఇటీవల చైనాలో లాంచ్ చేసిన మ్యాజిక్ వి3 వెర్షన్ మోడల్ నంబర్ ఎఫ్‌సీపీ-ఎఎన్10ని కలిగి ఉంది.

హానర్ మ్యాజిక్ V3 స్పెసిఫికేషన్‌లు :
హానర్ మ్యాజిక్ వి3 చైనీస్ వెర్షన్ 7.92-అంగుళాల ప్రైమరీ ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ స్క్రీన్‌తో పాటు 6.43-అంగుళాల ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండు డిస్‌ప్లేలు స్టైలస్ సపోర్ట్‌ను అందిస్తాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. దానితో పాటు గరిష్టంగా 16జీబీ ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజీని కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత మ్యాజిక్‌‌ఓఎస్ 8.0.1పై రన్ అవుతుంది. ట్రిపుల్ ఔటర్ కెమెరా సెటప్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో కెమెరా, 40ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. హానర్ మ్యాజిక్ వి3 సెల్ఫీలకు 40ఎంపీ వైడ్ యాంగిల్ లోపలి కెమెరాను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 66డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,150mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీఎక్స్8 రేటింగ్‌తో వస్తుంది.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డీల్.. ధర ఎంత తగ్గిందంటే? మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!

ట్రెండింగ్ వార్తలు