తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైల్వే ప్రాజెక్టులు.. పూర్తి వివరాలు వెల్లడించిన రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్

గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జితో పాటుగా ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగనుందని తెలిపారు.

Ashwini Vaishnaw

ఏపీ, తెలంగాణతో పాటు బిహార్, ఝార్ఖండ్ కొత్త రైల్వే ప్రాజెక్టు వివరాలను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హౌరా-చెన్నై రైల్వే కారిడార్ అనేక రాష్ట్రాలను కలుపుతుందని తెలిపారు. ఈ కారిడార్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించామని, విజయనగరం వరకు 3వ లైన్ నిర్మాణం ఆమోదం పొందిందని చెప్పారు.

మొత్తంగా 4 లైన్ల కారిడార్ నిర్మించాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. అసన్‌సోల్ (బెంగాల్) – వరంగల్ వరకు కలిపేలా సరికొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జునాగఢ్ – నవరంగ్‌పూర్, మల్కన్‌గిరి – పాండురంగాపురం వయా భద్రాచలం రైల్వై లైన్లు ఈ కారిడార్లో భాగంగా ఉంటాయని తెలిపారు. రూ.7,383 కోట్ల ఈ రెండు ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయని చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేయడంలో ఈ కారిడార్లు చాలా ఉపయోగకరంగా మారతాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బొగ్గును నేరుగా తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు చేరుకుంటుందని చెప్పారు. ఈ కారిడార్ ద్వారా 500-700 కి.మీ దూరం తగ్గుతుందని తెలిపారు. తెలంగాణలో 19.7, ఏపీలో 85.5 కి.మీ దూరం ఈ ప్రాజెక్టులో కవర్ అవుతోందని చెప్పారు.

గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జితో పాటుగా ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగనుందని తెలిపారు. కోస్తా ఏరియాలో తుఫాన్లు ఏర్పడినప్పుడు ఈ కారిడార్ సరకు రవాణాకు కీలకంగా మారుతుందని అన్నారు.మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం మీదుగా ఈ లైన్ సాగుతుందని చెప్పారు. ఆ ప్రాంతం అభివృద్ధికి ఈ మార్గం కీలకంగా మారనుందని తెలిపారు. ఈ మార్గంలో టన్నెల్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పారు. వైజాగ్ రైల్వే జోన్‌పై సీఎంతో మాట్లాడానని తెలిపారు. తమకు కేటాయించిన స్థలం నీరు నిలిచే ప్రాంతమని, కొత్తగా వేరే భూమి ఇవ్వాలని కోరామని, ఆ ఏర్పాట్లలో రాష్ట్రం ఉందని చెప్పారు.

Also Read: మా ఆయనను హెచ్చరించాను.. పార్టీ అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లాను: దువ్వాడ వాణి

ట్రెండింగ్ వార్తలు