రైల్వే లైన్ ద్వారా తెలంగాణ ఖనిజ సంపదను గుజరాత్‌కు తరలించే ప్రమాదం: బోయినపల్లి వినోద్

రైల్వే లైన్ ద్వారా తెలంగాణ ఖనిజ సంపదను గుజరాత్‌కు తరలించే అవకాశం ఉందని అన్నారు.

Vinod Kumar

కేంద్ర ప్రభుత్వం కొత్తగా భద్రాచలం నుంచి మల్కన్ గిరికి రైల్వే లైన్ మంజూరు చేసిందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పాండురంగాపురం నుంచి మల్కన్ గిరి వరకు ఈ రైల్వే లైన్ ఉంటుందని చెప్పారు. ఈ రైల్వే లైన్ కు చాలా ప్రాధాన్యం ఉందని, తెలంగాణ ఉద్యమంలో బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని బీఆర్ఎస్ నినాదం ఇచ్చిందని తెలిపారు.

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కోసం గత పదేళ్లుగా బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని చెప్పారు. విభజన చట్టంలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కడతామని కేంద్రం చెప్పిందని తెలిపారు. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదని సెయిల్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు. ఎన్.ఎం.డి.సి ఛత్తీస్‌ఢ్‌లో ఉన్న బైలాడిల్లా నుంచి బయ్యారం వరకు రైల్వే లైన్ ఉంటే ఐరన్ ఓర్ సరఫరా చేస్తామని చెప్పిందని తెలిపారు.

రైల్వే లైన్ ద్వారా తెలంగాణ ఖనిజ సంపదను గుజరాత్‌కు తరలించే అవకాశం ఉందని అన్నారు. దేశంలో 125 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతోందని చెప్పారు. స్టీల్ ఉత్పత్తిని 300 టన్నులకు పెంచాలనే ప్రతిపాదన ఉందని అన్నారు.

దేశంలో అత్యధికంగా స్టీల్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఉత్పత్తి అవుతోందని తెలిపారు. బయ్యారంలో తెలంగాణ స్టీల్ ప్లాంట్ అనే పేరుతో ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రారంభించాలని అన్నారు. భద్రాచలం టు మల్కన్ గిరి రైల్వే లైన్ కోసం బీఆర్ఎస్ ఫైట్ చేసిందని చెప్పారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైల్వే ప్రాజెక్టులు.. పూర్తి వివరాలు వెల్లడించిన రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్

ట్రెండింగ్ వార్తలు