Naga Chaitanya : నిశ్చాతార్థం అయ్యాక అత‌డి పెళ్లికి వెళ్లిన నాగ‌చైత‌న్య‌.. వీడియో వైర‌ల్‌

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌, న‌టి శోభిత దూళిపాళ ల నిశ్చాతార్థం ఆగ‌స్టు 8 (గురువారం) జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

Akkineni Naga Chaitanya attended assistant marriage in Rajahmundry

Akkineni Naga Chaitanya : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌, న‌టి శోభిత దూళిపాళ ల నిశ్చాతార్థం ఆగ‌స్టు 8 (గురువారం) జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లోని కింగ్ అక్కినేని నాగార్జున ఇంట్లో కేవ‌లం కుటుంబ స‌భ్యుల మ‌ధ్యే చాలా సింపుల్‌గా జ‌రిగింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ అందుకు సంబంధించిన ఫోటోల‌ను నాగ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరికొద్దిరోజుల్లోనే వీరిద్ద‌రు వివాహ బంధంతో ఒక్క‌టి కానున్నారు.

ఇక నిశ్చాతార్థం జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే నాగ చైత‌న్య ఓ పెళ్లిలో క‌నిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అది ఎవ‌రి పెళ్లో కాదు అత‌డి అసిస్టెంట్ వెంక‌టేశ్‌. రాజ‌మండ్రిలో జ‌రిగిన వెంక‌టేశ్ వివాహానికి చైతు హాజ‌రు అయ్యారు. నూత‌న వ‌ధూవ‌రుల్ని దీవించారు.

Committee Kurrollu : నిహారిక నిర్మాత‌గా ఫ‌స్ట్ సినిమా.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు ఎంతంటే..?

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమాలో నటిస్తున్నాడు. గీత ఆర్ట్స్ నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. సాయి పల్లవి హీరోయిన్‌గా న‌టిస్తోంది. సముద్ర జలాల్లో చేపలు పట్టుకునే మత్స్యకారులు అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు