Committee Kurrollu : నిహారిక నిర్మాత‌గా ఫ‌స్ట్ సినిమా.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు ఎంతంటే..?

మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ కమిటీ కుర్రోళ్ళు.

Committee Kurrollu : నిహారిక నిర్మాత‌గా ఫ‌స్ట్ సినిమా.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు ఎంతంటే..?

Committee Kurrollu first day collections

Updated On : August 10, 2024 / 4:09 PM IST

Committee Kurrollu collections : మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ కమిటీ కుర్రోళ్ళు. నూత‌న దర్శకుడు య‌దు వంశీ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పాపులర్ అయిన వాళ్ల‌తో పాటు, కొత్త వాళ్ల‌ని మెయిన్ లీడ్స్ గా తీసుకొని ఈ సినిమా నిర్మించడం విశేషం. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అంచ‌నాల‌ను పెంచేసిన ఈ మూవీ ఆగస్టు 9 శుక్ర‌వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియోన్స్ తో పాటు యూత్ ను ఆక‌ట్టుకుంటోంది. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. మొద‌టి రోజున ఈ సినిమా రూ.1.63 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్ష‌కులు ఆద‌రించారు. వారాంతాలు అయిన శ‌నివారం, ఆదివారం రోజుల్లో ఈ మూవీ క‌లెక్ష‌న్లు మ‌రింతగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

1980’s Radhekrishna : ‘1980లో రాధే కృష్ణ’ టీజర్ రిలీజ్.. తనికెళ్ళ భరణి వాయిస్‌తో..

క‌థ : ఒక ఊరిలో కొంతమంది స్నేహితులు ఉంటారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఆ ఊళ్ళో 12 ఏళ్లకు ఒకసారి జాతర జరుగుతుంది. ఫ్రెండ్స్ అంతా ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక విషయంలో వాళ్ళల్లో వాళ్లకు గొడవలు వచ్చి విడిపోతారు. ఆ గొడవలతో ఆ సంవత్సరం జాతరలో గొడవలు అవ్వడం, వీళ్ళ ఫ్రెండ్స్ లో ఒకరు చనిపోవడం జరుగుతుంది. దీంతో ఫ్రెండ్స్ అంతా విడిపోయి ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు.

మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత అదే జాతరకు ఫ్రెండ్స్ అంతా ఊరికి రావడం, జాతరలో ఓ సమస్య ఉండటం, అదే సమయంలో ఊరి పంచాయితీ ఎన్నికలు ఉండటం జరుగుతాయి. మరి ఈ ఫ్రెండ్స్ మధ్య అసలు గొడవలు ఎందుకొచ్చాయి, వీళ్ళు 12 ఏళ్ళ తర్వాత అయినా కలిసారా? మళ్ళీ ఆ ఊరి జాతరని ఈ ఫ్రెండ్స్ జరిపించారా? ఎన్నికల్లో ఎవరు గెలిచారు అనేది తెరపై చూడాల్సిందే.

Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్ది ఫస్ట్ సినిమా ఆగిపోయిందా? హీరో ఇలా.. నిర్మాత అలా..