Instagram Single Reel : ఇన్‌స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై సింగిల్ రీల్స్‌లో 20 సాంగ్స్ వరకు యాడ్ చేయొచ్చు..!

Instagram Single Reel : మీరు ఇప్పుడు యాప్‌లోనే టెక్స్ట్, స్టిక్కర్‌లు, క్లిప్‌లతో ఆడియోను కూడా పంపుకోవచ్చు. మీ వీడియోలను ఎడిట్ చేయడానికి అదనపు టూల్స్ అవసరం లేదు.

Instagram single reel ( Image Source : Google )

Instagram Single Reel : ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా? ఇన్‌స్టా యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇన్‌స్టా రీల్స్ చేసే సమయంలో ఒకటికి మించి అధిక సంఖ్యలో సాంగ్స్ యాడ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా రీల్‌కి ఒకటి కన్నా ఎక్కువ పాటలను యాడ్ చేసేందుకు ప్రయత్నించారా? ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు అది సాధ్యం చేసింది. నేటి నుంచి ఇన్‌స్టాభారతీయ వినియోగదారులను ఒకే రీల్‌కు 20 ఆడియో ట్రాక్‌లను యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది.

Read Also : Amazon Prime Day Sale : ఈ నెల 20 నుంచే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. లాంచ్ కానున్న కొత్త ల్యాప్‌టాప్స్ ఇవే..!

కొత్త మల్టీ ఆడియో ట్రాక్‌ల ఫీచర్‌తో యూజర్లు ఇప్పుడు వారి రీల్స్‌కు మల్టీ ఆడియో ట్రాక్‌లను యాడ్ చేయొచ్చు. ఎడిటింగ్ ప్రక్రియలో టెక్స్ట్, స్టిక్కర్లు, వీడియో క్లిప్‌లతో ఈ ట్రాక్‌లను వ్యూ మాదిరిగా చేయొచ్చు. వినియోగదారులు ట్రాక్‌లను సరైన క్లిప్‌లతో యాడ్ చేయవచ్చు. కంటెంట్ మరింత ఆకర్షణీయంగా కస్టమైజ్ చేయొచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి ఇదే విషయాన్ని షేర్ చేశారు. మీ కంటెంట్‌తో మరింత క్రియేటివిటీని అందిస్తుంది. మీ ఆడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎడిట్ చేసే సమయంలో టెక్స్ట్, స్టిక్కర్లు క్లిప్‌లతో అలైన్ చేయవచ్చు. మీరు ఇలా చేసినప్పుడు, సొంత ప్రత్యేకమైన ఆడియో మిక్స్‌ను కూడా క్రియేట్ చేయొచ్చు. ఫాలోవర్లు కూడా సేవ్ చేయవచ్చు. మళ్లీ వాటిని ఉపయోగించుకోవచ్చు.

సింగిల్ రీల్‌కు 20 ఆడియో ట్రాక్‌లు :
మల్టీ ట్రాక్‌ల ద్వారా వినియోగదారులు ప్రత్యేకమైన ఆడియో మిక్స్‌లను క్రియేట్ చేయొచ్చు. క్రియేటివిటీ కమ్యూనిటీలోని వారి ఫాలోవర్లు ఈ మిక్స్ సేవ్ చేయవచ్చు. అవసరమైతే తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఒకే రీల్‌కి గరిష్టంగా 20 ఆడియో ట్రాక్‌లను యాడ్ చేయొచ్చు. మీ వీడియోలోని వివిధ ఫ్రేమ్‌లను కచ్చితమైన ఆడియోతో మిక్స్ చేయొచ్చు. మీ కంటెంట్‌ని చూసేందుకు మరింత ఆసక్తికరంగా సరదాగా ఉంటుంది. మీరు ప్రత్యేకమైన ఆడియో మిక్స్‌లను క్రియేట్ చేసినప్పుడు మీ ఫాలోవర్లు వాటిని సేవ్ చేయవచ్చు. మీ కంటెంట్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా చేస్తుంది.

మీరు ఇప్పుడు యాప్‌లోనే టెక్స్ట్, స్టిక్కర్‌లు, క్లిప్‌లతో ఆడియోను కూడా పంపుకోవచ్చు. మీ వీడియోలను ఎడిట్ చేయడానికి అదనపు టూల్స్ అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది యాక్టివ్ యూజర్‌లు ఉన్నందున ఈ ఫీచర్‌ను మొదట భారత్‌‌లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మల్టీ ఆడియో ట్రాక్‌లను క్రియేట్ చేసుకోవచ్చు.

ప్రత్యేకించి వీడియో ఎడిటింగ్‌కి కొత్తవారైతే.. ఇన్‌స్టా ఫీచర్ ద్వారా సులభమైన డిజైన్‌ చేసుకోవచ్చు. మొత్తంమీద, ఇన్‌స్టాగ్రామ్ కొత్త మల్టీ-ఆడియో ట్రాక్‌ల ఫీచర్ రీల్స్‌ను సరదాగా, క్రియేటివిటీగా ఉండేలా చేస్తుంది. సాధారణ యూజర్ల నుంచి వృత్తిపరమైన క్రియేటర్ల వరకు అందరికీ ప్రయోజకరంగా ఉంటుంది.

Read Also : Vi Roaming Packs : వోడాఫోన్ ఐడియాలో కొత్తగా 3 పోస్టు‌పెయిడ్ రోమింగ్ ప్యాక్స్.. 120 దేశాల్లో సర్వీసులు.. రీఛార్జ్ ప్యాక్ ఎలా పొందాలి?

ట్రెండింగ్ వార్తలు