Moto G85 5G Sale : భారత్‌లో మోటో G85 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర, స్పెసిఫికేషన్‌లు, సేల్ ఆఫర్లు ఇవే!

Moto G85 5G Sale : ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ గత వారం స్నాప్‌డ్రాగన్ 6s జనరేషన్ 3 చిప్‌సెట్ కింద 12జీబీ వరకు ర్యామ్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Moto G85 5G Goes on Sale in India ( Image Source : Google )

Moto G85 5G Sale : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటోరోలా ఇండియా కొత్త ఫోన్ మోడల్ సేల్ ప్రారంభమైంది. మోటో G85 5జీ దేశ మార్కెట్లో మొదటిసారిగా ఈరోజు (జూలై 16) ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది.

Read Also : Motorola Edge 50 Neo : అదిరే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 5o నియో ఫోన్.. మొత్తం 4 కలర్ ఆప్షన్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ గత వారం స్నాప్‌డ్రాగన్ 6s జనరేషన్ 3 చిప్‌సెట్ కింద 12జీబీ వరకు ర్యామ్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ ప్రధాన సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. మోటో జీ85 5జీ ఫోన్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

భారత్‌లో మోటో G85 5జీ ధర, సేల్ ఆఫర్లు :
మోటో G85 5జీ ప్రారంభ ధర భారత్‌లో బేస్ 8జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999కు పొందవచ్చు. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 19,999కు పొందవచ్చు. ఆలివ్ గ్రీన్, కోబాల్ట్ బ్లూ, అర్బన్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా.ఇన్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై రూ. 1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. కొనుగోలుదారులు బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. మోటో జీ85 5జీని కొనుగోలు చేసేటప్పుడు పాత ఫోన్ ట్రేడింగ్‌పై రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు.

దాంతో ఈ మోటో ఫోన్ ధరను రూ. 16,999 తగ్గింపు ధరకు కొనుగోలు చేయొచ్చు. అదే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే మోటో జీ85 ఫోన్ రూ. 17,300 ధరకు అందుబాటులో ఉంది. వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐతో నెలకు రూ. 1,889 చొప్పున తొమ్మిది నెలల వరకు పొందవచ్చు. రిలయన్స్ జియో యూజర్లు రూ. 2వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.

మోటో జీ85 5జీ స్పెసిఫికేషన్లు :
డ్యూయల్ సిమ్ (నానో) మోటో జీ85 5జీ ఆండ్రాయిడ్ 14-ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది. మోటోరోలా ఫోన్‌కు రెండు ఏళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, నాలుగు ఏళ్ల భద్రతా అప్‌డేట్స్ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) 3డీ కర్వ్డ్ పోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 6s జనరేషన్ 3 చిప్‌సెట్‌తో పాటు అడ్రినో 619 జీపీయూ, 12జీబీ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. వాడని స్టోరేజ్‌తో ర్యామ్‌ని వర్చువల్‌గా 24జీబీ వరకు పెంచుకోవచ్చు.

మోటో జీ85 5జీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50ఎంపీ సోనీ లైటియా 600 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో పాటు ఒకే ఎల్ఈడీ ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. మోటో జీ85 5జీ ఐపీ52-రేటెడ్ వాటర్-రిపెల్లెంట్ బిల్డ్‌ను కలిగి ఉంది.

బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. బ్యాటరీ 34 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది.

Read Also : Amazon Prime Day Sale : ఈ నెల 20 నుంచే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై టాప్ డీల్స్.. డోంట్ మిస్..!

ట్రెండింగ్ వార్తలు