iQoo Z9x 5G Launch : ఐక్యూ Z9x 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 16నే లాంచ్.. డిజైన్ వివరాలు లీక్..!

iQoo Z9x 5G Launch : భారతీయ వేరియంట్ చైనీస్ మోడల్‌తోసమానమైన స్పెసిఫికేషన్‌లను కూడా రివీల్ చేసింది. ఐక్యూ Z9ఎక్స్ 5జీ ఫోన్ గురించి ఇటీవలే కంపెనీ ఇండియా వెబ్‌సైట్‌లో లిస్టు చేసింది.

iQoo Z9x 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ నుంచి సరికొత్త ఐక్యూ Z9x 5జీ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. కొన్ని వివరాలతో పాటు మోడల్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. ఐక్యూ ఇండియా సీఈఓ నిపున్ మరియా రాబోయే మోడల్ డిజైన్ కలర్ కూడా వెల్లడించారు.

రాబోయే కొత్త హ్యాండ్‌సెట్ డిజైన్ చైనీస్ వెర్షన్ ఐక్యూ Z9 5జీ ఫోన్ మాదిరిగానే కనిపిస్తుంది. భారతీయ వేరియంట్ చైనీస్ మోడల్‌తోసమానమైన స్పెసిఫికేషన్‌లను కూడా రివీల్ చేసింది. ఐక్యూ Z9ఎక్స్ 5జీ ఫోన్ గురించి ఇటీవలే కంపెనీ ఇండియా వెబ్‌సైట్‌లో లిస్టు చేసింది.

Read Also : Vivo V30e Launch : అద్భుతమైన ఫీచర్లతో వివో V30e కొత్త ఫోన్ లాంచ్.. 4K వీడియో రికార్డింగ్.. ధర ఎంతో తెలుసా?

ఐక్యూ Z9x 5జీ ఫోన్ మే 16న భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని ధృవీకరిస్తూ ఐక్యూ ఇండియా సీఈఓ నిపున్ మరియా పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్ రాబోయే స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్‌ను కూడా వెల్లడించింది. ఈ ఫోన్ లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో ఫెదర్ లాంటి ప్యాట్రన్స్‌తో కనిపిస్తుంది.

ఐక్యూ Z9x 5జీ ఫోన్ స్పెషిఫికేషన్లు ( అంచనా) :
టాప్ లెఫ్ట్ కార్నర్‌లో రౌండ్ ఎడ్జ్‌లతో చతురస్రాకారంలో ఉంటుంది. కొద్దిగా పైకి ఉండేలా కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది. రెండు కెమెరా సెన్సార్లు, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ రైట్ ఎడ్జ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్‌లతో కనిపిస్తుంది.

అమెజాన్‌‌లో భారతీయ వేరియంట్ ఐక్యూ Z9x 5జీ ఫోన్ చైనాలో స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ, 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.72-అంగుళాల 120హెచ్‌జెడ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 50ఎంపీ ఏఐ-బ్యాక్డ్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉన్నాయి. 8ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఆర్జిన్ఓఎస్ 4తో వస్తుంది. చైనాలో ఐక్యూ Z9ఎక్స్ 5జీ ఫోన్ 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ధర 1,299 (సుమారు రూ.15వేలు) నుంచి ప్రారంభమవుతుంది. డార్క్ నైట్, ఫెంగ్ యుకింగ్, స్టార్‌బర్స్ట్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Read Also : Vivo Y18 Series Launch : వివో నుంచి రెండు సరికొత్త ఫోన్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు