Lava Blaze 2 5G Launch : కొత్త ఫోన్ కావాలా భయ్యా.. భారీ బ్యాటరీతో లావా బ్లేజ్ 2 5G ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే..!

Lava Blaze 2 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? లావా నుంచి భారీ బ్యాటరీతో సరికొత్త మోడల్ 5G ఫోన్ వచ్చేసింది. ధర, ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Lava Blaze 2 5G With MediaTek Dimensity 6020 SoC, 5,000mAh Battery Launched in India

Lava Blaze 2 5G Launch : కొత్త ఫోన్ కావాలా? దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా ఇంటర్నేషనల్ (Lava International) నుంచి లేటెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ వచ్చేసింది. కొత్త లావా బ్లేజ్ 2 5G ఆఫర్‌గా గురువారం (నవంబర్ 2) భారత మార్కెట్లో లాంచ్ అయింది. లావా బ్లేజ్ 2 5G ఫోన్ గత ఏడాదిలో బ్లేజ్ 5Gకి అప్‌గ్రేడ్‌గా వస్తుంది. గ్లాస్ బ్యాక్‌తో 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల 2.5D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. లావా బ్లేజ్ 2 5G ఫోన్.. మీడియాటెక్ డైమెన్షిటీ 6020 SoCతో 6GB వరకు ర్యామ్, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రన్ అవుతుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

Read Also : Windows 11 Free Update : మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఫ్రీ అప్‌డేట్.. ఇకపై అందరికి అందుబాటులోకి.. ఎలా పొందాలంటే?

భారత్‌లో లావా బ్లేజ్ 2 5G ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో లావా బ్లేజ్ 2 5జీ ఫోన్ 4GB ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 9,999కు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర ఎంత అనేది తెలియదు. ఈ ఫోన్ గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. నవంబర్ 9 నుంచి లావా ఇ-స్టోర్, అమెజాన్ ఇండియా ద్వారా విక్రయిస్తోంది. లావా బ్లేజ్ 2 4G ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర 8,999కు సొంతం చేసుకోవచ్చు. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ ఆరెంజ్ షేడ్స్‌లో వస్తుంది. లావా బ్లేజ్ 5జీ గతేడాది నవంబర్‌లో సింగిల్ 4GB ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్‌కు రూ. 9,999కు కొనుగోలు చేయొచ్చు.

లావా బ్లేజ్ 2 5G స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్-సిమ్ (నానో) లావా బ్లేజ్ 2 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 కి అప్‌గ్రేడ్ అయింది. రెండు ఏళ్ల త్రైమాసిక సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. 2.5D కర్వ్డ్ స్క్రీన్‌లో సెల్ఫీ షూటర్‌ హోల్ పంచ్ కటౌట్ ఉంది. కొత్త లావా ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 SoC ద్వారా అందిస్తుంది. దాంతో పాటు గరిష్టంగా 6GB ర్యామ్ కూడా ఉంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ఉపయోగించని స్టోరేజీ ఉపయోగించి అందుబాటులో ఉన్న మెమరీని 12జీబీ వరకు విస్తరించవచ్చు.

Lava Blaze 2 5G MediaTek Dimensity Launched in India

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. లావా బ్లేజ్ 2 5జీ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 0.08MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు స్క్రీన్ ఫ్లాష్‌తో ముందు భాగంలో 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. తద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. లావా బ్లేజ్ 2 5జీ ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, బ్లూటూత్, FM రేడియో, Wi-Fi 802.11 b/g/n/ac, OTG, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. లావా హ్యాండ్‌సెట్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించింది. అథెంటికేషన్ కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. లావా బ్లేజ్ 2 5G ఫోన్ 18W ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా, 164.2x76x8.45mm, 203 గ్రాములు ఉంటుంది.

Read Also : Lava Blaze Pro Price : రూ. 15వేల లోపు ధరకే బెస్ట్ లావా బ్లేజ్ ప్రో 5G ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు