New Kia Sonet facelift : డిసెంబర్ 14న కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కారు వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?

New Kia Sonet facelift : కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కారు వచ్చేస్తోంది. డిసెంబర్ 14న ఈ కొత్త కారును కియా ఇండియా ఆవిష్కరించనుంది. మరిన్ని పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

New Kia Sonet facelift unveil on December 14

New Kia Sonet facelift : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ కియా ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను డిసెంబర్ 14న ఆవిష్కరిస్తుంది. కొత్త అప్‌డేట్ సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ జనవరి 2024లో భారత మార్కెట్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. కియా సోనెట్ ఇండియా అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటి. రాబోయే ఈ కొత్త మోడల్ టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి వాటితో పోటీగా వస్తోంది.

Read Also : Ola S1 X Plus Price Cut : ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 20వేల ధర తగ్గింపు.. డోంట్ మిస్!

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ స్పెషిఫికేషన్లు :
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ టీజర్‌లో అనేక వివరాలను రివీల్ చేసింది. ముఖ్యంగా వెహికల్ ముందు డిజైన్, గ్రిల్ రీడిజైన్ ఆకర్షణీయంగా ఉండనుంది. ప్రతి యూనిట్‌లో 3 ఎల్ఈడీలను కలిగిన కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు ఉన్నాయి. డీఆర్ఎల్, ఫాగ్ లైట్లు, ఎల్ఈడీ యూనిట్లు, బంపర్ కూడా రీస్టోర్ చేయనుంది. వెనుక వైపు కనిపించనప్పటికీ కొన్ని మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

New Kia Sonet facelift  

క్యాబిన్‌లోని ప్రధాన మార్పులలో 2023 కియా సెల్టోస్‌లో చూసినట్లుగానే సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అప్‌డేట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 360-డిగ్రీ కెమెరాతో రావొచ్చు. మరో ముఖ్యమైన అప్‌డేట్ ఏడీఏఎస్ టెక్ ఇప్పటికే హ్యుందాయ్ వెన్యూలో ఉంది.

ధర ఎంత ఉండొచ్చుంటే? :
హుడ్ కింద, కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 3 ఇంజన్ ఆప్షన్లతో రానుంది. 83హెచ్‌పీ, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 120హెచ్‌పీ, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 116హెచ్‌పీ, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పాటు ఈ పవర్‌ట్రెయిన్‌లు ప్రస్తుత ట్రాన్స్‌మిషన్ పెయిర్స్ అలాగే ఉంచుతాయని భావిస్తున్నారు. ఇందులో పెట్రోల్ ఇంజిన్ కోసం 5-స్పీడ్ మాన్యువల్ ఉంటుంది.

టర్బో-పెట్రోల్ 6-స్పీడ్ ఐఎంటీ, 6-స్పీడ్ డీసీటీ, డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఐఎంటీ, 6-స్పీడ్ ఏటీ ఉండవచ్చు. భారత మార్కెట్లో కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : WhatsApp Feature : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను పంపుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు