OnePlus Buds Pro 3 : వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, స్పెషిఫికేషన్లు లీక్..!

OnePlus Buds Pro 3 Launch : నివేదిక ప్రకారం.. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 బాక్స్ ధర రూ. 13,999తో వస్తుంది. గత ఏడాదిలో వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2కి సమానమైన ధరకే రిటైల్ చేయవచ్చు. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 భారత్‌లో రూ. 11,999 ధరతో ప్రారంభమైంది.

OnePlus Buds Pro 3 India price, specifications leaked ahead of imminent launch

OnePlus Buds Pro 3 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3ని వచ్చే వారం లాంచ్ చేయాలని యోచిస్తోంది. లీక్ ఫొటోల ప్రకారం.. వన్‌ప్లస్ గత ఏడాదిలో బడ్స్ ప్రో 2, ఈ ఏడాదిలో వన్‌ప్లస్ బడ్స్ 3తో పోల్చితే.. కొత్త ఇయర్‌బడ్స్‌తో పెద్ద డిజైన్ మార్పు చేయాలని చూస్తోంది. అదే సమయంలో కొత్త వేగన్ లెదర్ టచ్‌కు మరింత ప్రీమియం ఎండ్ అందిస్తోంది.

Read Also : Redmi Note 14 Launch : రెడ్‌మి నోట్ 14, పోకో x7 నియో ఫోన్లు వచ్చేస్తున్నాయి.. లాంచ్‌కు ముందే వివరాలు లీక్..!

వన్‌ప్లస్ కంపెనీ భారత్ లేదా ప్రపంచవ్యాప్తంగా ఇయర్‌బడ్‌ల లాంచ్‌ను అధికారికంగా ధృవీకరించలేదు. కంపెనీ వచ్చే వారంలో దేశంలో కొత్త టీడబ్ల్యూఎస్ ప్రారంభించాలని సూచిస్తుంది. ఇంతలో, వన్‌ప్లస్ కొత్త ఆడియో ప్రొడక్టును సూచించే క్రిప్టిక్ ఎక్స్ పోస్ట్‌ను కూడా షేర్ చేసింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు భారత్, యూరప్, ఉత్తర అమెరికా నుంచి కమ్యూనిటీ సభ్యులకు కొత్త ప్రొడక్టును స్టోర్‌లలోకి వచ్చే ముందు రివ్యూ చేసే అవకాశాన్ని కూడా ఇచ్చింది.

వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 భారత్ ధర ఎంత ఉండొచ్చుంటే? :
నివేదిక ప్రకారం. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 బాక్స్ ధర రూ. 13,999తో వస్తుంది. గత ఏడాదిలో వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2కి సమానమైన ధరకే రిటైల్ చేయవచ్చు. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 భారత్‌లో రూ. 11,999 ధరతో ప్రారంభమైంది. వన్‌ప్లస్ బ్రార్ 11ఎమ్ఎమ్ వూఫర్, 6ఎమ్ఎమ్ ట్వీటర్‌తో డ్యూయల్ డ్రైవర్ సెటప్, ఎల్‌హెచ్‌డీసీ 5.0 కోడెక్‌కు సపోర్టుతో సహా స్మార్ట్‌ప్రిక్స్ రిపోర్టు ద్వారా గతంలో వెల్లడించిన కొన్ని ఫీచర్లను కూడా రివీల్ చేసింది. రిపోర్టు ప్రకారం.. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 50డీబీ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది.

గత వెర్షన్‌తో పోలిస్తే.. రెండు రెట్లు వాయిస్ కాల్స్ క్లారిటీని అందిస్తుంది. కేస్‌పై 43 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. బడ్స్ ప్రో 2 కన్నా 4 గంటలు ఎక్కువగా ఛార్జింగ్ వస్తుంది. స్మార్ట్‌ప్రిక్స్ నివేదిక ప్రకారం.. 10 నిమిషాల ఛార్జ్‌తో 5 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ అందిస్తుంది. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 ఐపీ55 స్ప్లాష్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. అంతేకాకుండా, బ్లూటాత్ వెర్షన్ 5.4కి సపోర్టుతో వస్తాయని కూడా సూచిస్తుంది. దీని ఫలితంగా బడ్స్ కేవలం 94 మిల్లీసెకన్ల వద్ద అల్ట్రా-లో లేటెన్సీ ఆడియోను అందిస్తుంది.

Read Also : Best Phones 2024 : ఈ ఆగస్టులో రూ.35వేల లోపు ధరలో బెస్ట్ మొబైల్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు