తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసం కావడం బాధాకరం- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసలు

తుంగభద్ర డ్యామ్ 19వ గేటు శనివారం రాత్రి ఊడిపోయింది. డ్యామ్ ఇన్ ఫ్లో తగ్గడంతో రాత్రి డ్యామ్ గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు.

Tungabhadra Dam 19th Gate Washed Away (Photo Credit : Facebook)

Tungabhadra Dam 19th Gate Washed Away : తుంగభద్ర డ్యామ్ గేట్లలో ధ్వంసమైన 19వ గేటును కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. గేటు ధ్వంసం అవటానికి గల కారణాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధాకరమని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ డ్యామ్ కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. 3 రాష్ట్రాలకు వరప్రదాయిని అని తెలిపారు. తుంగభద్ర డ్యామ్ లో 60 టీఎంసీల నీరు నిల్వ ఉంచే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ధ్వంసమైన గేటుపై ఒత్తిడి పెరగడకుండా.. మిగతా గేట్ల ద్వారా 30వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్దరణ చేస్తామని వెల్లడించారు.

తుంగభద్ర డ్యామ్ 19వ గేటు శనివారం రాత్రి ఊడిపోయింది. డ్యామ్ ఇన్ ఫ్లో తగ్గడంతో రాత్రి డ్యామ్ గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు. దాంతో 19వ గేటు చైన్ తెగింది. గేటు తీసే సమయంలో తగిన జాగ్రత్తలు అధికారులు తీసుకోలేదు. గేటు తెగడంతో నీటి ప్రవాహం పోటెత్తింది. ధ్వంసమైన గేటుపై ఒత్తిడి తగ్గించేందుకు తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల నుంచి నీరు బయటకు వదిలారు. మరోవైపు ప్రాజెక్ట్ నుంచి 60 టీఎంసీల నీరు బయటకు పంపిన తర్వాత గేటు పునరుద్దరణ పనులు చేపట్టే అవకాశం ఉంది.

Alos Read : తుంగభద్ర డ్యామ్‌కు పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన గేటు.. దిగువ ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు

ట్రెండింగ్ వార్తలు