ఎంత మంచోడో.. ఇతడికి ఎంత దయాగుణం ఉందో.. వీడియో చూశారా?

వికలాంగుడు కూడా కావడంతో కాస్త భయపడుతూ ఉంటాడు. అతడికి వద్దకు ఆ కారు ఓనర్, కంటెంట్ క్రియేటర్..

మంచితనం, జాలి, దయాగుణం మానవుడికి శిరోభూషణాల వంటివి. మంచి రూపం లేకపోయినా మంచితనం ఉంటే అవే మనిషికి అందాన్ని తెచ్చిపెడతాయి. దయ, సానుభూతితో మెలిగే మనుషులు ఈ కాలంలో మచ్చుకైనా కనపడడం లేదని అనుకుంటాం. ఇటువంటి సమయంలో ఎవరైనా ఓ మంచి మనిషి కనపడితే అతడిని దేవుడిలా చూస్తాం.

తాజాగా, ఓ యువకుడి పట్ల శ్రీను మాలిక్ (రవికుమార్) అనే ఓ కంటెంట్ క్రియేటర్ ప్రవర్తించిన తీరుచూసి అతడిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఈ వీడియో. చిరు వస్తువులు అమ్ముకుంటూ జీవిస్తున్న ఓ యువకుడు ఖరీదైన పోర్స్చే కారు ముందు నిలబడి ఫొటో తీసుకోబోయాడు.

ఆ యువకుడు వికలాంగుడు కూడా కావడంతో కాస్త భయపడుతూ ఉంటాడు. అతడికి వద్దకు ఆ కారు ఓనర్, కంటెంట్ క్రియేటర్ శ్రీను మాలిక్ వచ్చి అతడిని చూస్తాడు. శ్రీను మాలిక్ ను చూడగానే వికలాంగుడు ఫొటో తీసుకోవడం ఆపేసి పారిపోబోతాడు. ఆ వికలాంగుడిని శ్రీను మాలిక్ దగ్గరకు తీసుకుని, కారులో కూర్చోబెట్టి ఫొటోలు తీస్తాడు. కారులోనే కాసేపు తిప్పుతాడు. దీంతో ఆ వికలాంగుడు మురిసిపోతాడు. ఈ వీడియోను మీరూ చూడండి..

Also Read: ఈ ఆగస్టులో రూ.35వేల లోపు ధరలో బెస్ట్ మొబైల్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు