Realme 13 4G Launch : సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో రియల్‌మి 13 4జీ ఫోన్.. కెమెరా ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Realme 13 4G Launch : రియల్‌మి 13 4జీ 67డబ్ల్యూ వైర్డు సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఫోన్‌లో డ్యూయల్ 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లు ఉన్నాయి.

Realme 13 4G With 50-Megapixel Main Camera, 67W SuperVOOC Charging Launched ( Image Source : Google )

Realme 13 4G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్‌మి 13 4జీ ఫోన్ వచ్చేసింది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, స్నాప్‌డ్రాగన్ 685 ఎస్ఓసీ, వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌, 5,000mAh బ్యాటరీతో వస్తుంది. రియల్‌మి 12 సిరీస్‌లో చూసిన అదే లగ్జరీ వాచ్-ప్రేరేపిత డిజైన్‌ను కలిగి ఉంది. రియల్‌మి 13ప్రో 5జీ, రియల్‌మి 13ప్రో ప్లస్ 5జీ కలిగిన రియల్‌మి 13 లైనప్‌లో చేరింది. రియల్‌మి 13 5జీ, రియల్‌మి 13 ప్లస్ 5G హ్యాండ్‌సెట్‌లు కూడా ఇటీవలే సర్టిఫికేషన్ సైట్‌లలో కనిపించాయి.

Read Also : JioBharat Market Share : జియోభారత్ ఫోన్‌కు ఫుల్ డిమాండ్.. రూ.వెయ్యి లోపు ఫోన్‌ మార్కెట్‌లో 50 శాతం వాటా..!

రియల్‌మి 13 4జీ ధర, లభ్యత :
రియల్‌మి 13 4జీ ఫోన్ 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ధర IDR 27,99,000 (దాదాపు రూ. 14,700) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర IDR 29,99,000 (సుమారు రూ. 15,800) ఇండోనేషియాలో రియల్‌మి ఇండోనేషియా వెబ్‌సైట్ ద్వారా ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పయనీర్ గ్రీన్, స్కైలైన్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

రియల్‌మి 13 4జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
రియల్‌మి 13 4జీ ఫోన్ 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (2,400 x 1,080 పిక్సెల్‌లు) అమోల్డ్ స్క్రీన్‌ను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2,000 నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయిని కలిగి ఉంది. డిస్‌ప్లే రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. స్క్రీన్‌కు టచ్‌లు, వాటర్‌డ్రాప్‌ల మధ్య తేడాను గుర్తించడంలో సాయపడుతుంది. తద్వారా వినియోగదారులు తడి చేతులతో లేదా వర్షంలో ఫోన్‌ను ఉపయోగించవచ్చు.

రియల్‌మి 13 4జీ, అడ్రినో 610 జీపీయూ, 8జీబీఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 685 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ర్యామ్ వర్చువల్‌గా అదనంగా 8జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి యూఐ 5.0తో ఫోన్, ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రియల్‌మి 13 4జీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్, 2ఎంపీ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లోని ఫ్రంట్ కెమెరా 16ఎంపీ సెన్సార్‌ను ఉపయోగిస్తుంది.

రియల్‌మి 13 4జీ 67డబ్ల్యూ వైర్డు సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఫోన్‌లో డ్యూయల్ 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, క్యూజెఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లు ఉన్నాయి. స్ప్లాష్ నిరోధకతకు ఐపీ64-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చి ఉంది. రియల్ టైమ్ హృదయ స్పందన రేటును కూడా గుర్తించగలదు. ఈ ఫోన్ పరిమాణం 162.95 x75.45x 7.92 మిమీ, బరువు 187 గ్రాములు ఉంటుంది.

Read Also : Vivo V40 Pro Series : వివో నుంచి సరికొత్త వి40 ప్రో సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు