Hyundai SUV : కొత్త కారు కొంటున్నారా? మీరు ఈ నెలలో హ్యుందాయ్ ఎస్‌యూవీని కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. హ్యుందాయ్ వెన్యూ, ఎక్స్‌టర్ వంటి పాపులర్ హ్యుందాయ్ ఎస్‌యూవీ ఆగస్టులో ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తున్నాయి. అత్యధికంగా అమ్ముడైన క్రెటాపై మాత్రం ఆఫర్‌లు లేవు. హ్యుందాయ్ వెన్యూ ఆగస్టులో రూ.70,629 వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. గత జూలైలో ఎస్‌యూవీపై ఆఫర్‌లు రూ.55వేల నుంచి పెరిగాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై మొత్తం తగ్గింపులు జూలైలో రూ. 20వేల నుంచి ఆగస్టులో రూ. 32,972కి పెరిగాయి. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటైన హ్యుందాయ్ క్రెటా ఆగస్టులో ఎలాంటి డిస్కౌంట్లను అందించదు. ఎస్‌యూవీకి డిమాండ్ చాలా ఎక్కువగా పెరిగింది. అరుదుగా డిస్కౌంట్లను అందిస్తుంటుంది. హ్యుందాయ్ వెన్యూ ధర రూ. 7.94 లక్షల నుంచి రూ. 13.44 లక్షలు (ఎక్స్-షోరూమ్). హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.43 లక్షల (ఎక్స్-షోరూమ్)లో ఉంది. హ్యుందాయ్ వెన్యూలో మూడు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.
కప్పా 1.2-లీటర్ ఎంపీఐ పెట్రోల్ (83పీఎస్, 114ఎన్ఎమ్), కప్పా 1.0-లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ (120పీఎస్ 172ఎన్ఎమ్) యూ2 1.5-లీటర్ సీఆర్‌డీఐ డీజిల్ వీజీటీ (116పీఎస్ 250ఎన్ఎమ్). ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 1.2-లీటర్ పెట్రోల్ మిల్లుతో 5-స్పీడ్ ఎంటీ, 1.0-లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ మిల్లుతో 6-స్పీడ్ ఎంటీ 7-స్పీడ్ డీసీటీ 1.5-లీటర్ సీఆర్‌డీఐ డీజిల్ మిల్లుతో 6-స్పీడ్ ఎంటీ ఉన్నాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ 5-స్పీడ్ ఎంటీ, 5-స్పీడ్ ఎఎంటీ ఆప్షన్లతో కప్పా 1.2-లీటర్ ఎంపీఐ పెట్రోల్ ఇంజన్ (83పీఎస్ 114ఎన్ఎమ్)ను ఉపయోగిస్తుంది. 5-స్పీడ్ ఎంటీతో కూడిన సీఎన్‌జీ ఆప్షన్ (69పీఎస్ 95ఎన్ఎమ్) కూడా అందుబాటులో ఉంది. సీఎన్‌జీ వేరియంట్‌ను ఒకే సిలిండర్ లేదా డ్యూయల్ సిలిండర్‌లతో కలిగి ఉండవచ్చు.