Reliance Jewels Celebrate 17 Years with Launch of Exclusive Aabhar Collection
Reliance Jewels : ప్రముఖ దేశీయ బ్రాండ్ ఈ రిలయన్స్ జ్యువెల్స్ 17 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నైపుణ్యం, సేవలతో వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు ఆభర్ కలెక్షన్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది నుంచి ఆభర్ కలెక్షన్‌లో వినియోగదారుల కోసం ఇయర్ రింగ్స్ (చెవి పోగులు) అందుబాటులో ఉంటాయి. గతంలో మాదిరిగానే రిలయన్స్ ప్రొడక్టులను వినియోగదారులు ఆదరించగా, అదేరీతిలో సరికొత్త ఆభర్ కలెక్షన్ కూడా ఆదరిస్తారని రిలయన్స్ జ్యువెల్స్ భావిస్తోంది.
Read Also : My Home Akrida : హైదరాబాద్‌లో మరో టాలెస్ట్ టవర్.. 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్ అక్రిదా
“ఇయర్ రింగ్స్ దట్ ఎక్స్ ప్రెస్ యు” అనే ట్యాగ్‌తో ఆభర్ కలెక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఆభర్ కలెక్షన్‌లో ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా నచ్చేలా ఉంటుంది. అన్ని వయస్సుల వారిని దృష్టిలో పెట్టుకుని ఇయర్ రింగ్‌ల సరికొత్త కలెక్షన్ అందిస్తుంది. ఫ్యాషన్ కోరుకునే వారికి అద్భుతమని చెప్పవచ్చు. ఇందులో బంగారం, వజ్రం, వెండితో రూపొందించినవి ఉన్నాయి. కాలేజీ విద్యార్థులు ఇష్టపడేలా క్యాజువల్ స్టడ్‌లు, హోప్స్ సైతం ఇందులో ఉంటాయి. మహిళలకు డాంగ్లర్, సాంప్రదాయ జుమ్కీలు, జే-బాలీ డిజైన్‌లు అందుబాటులో ఉన్నాయి.
దేశంలోని 200కి పైగా నగరాల్లో 400 స్టోర్‌లలో రిలయన్స్ ఆభర్ కలెక్షన్ అందుబాటులో ఉంది. వినియోగదారులకు అద్భుతమైన సువర్ణావకాశాన్ని అందిస్తుంది. బంగారం తయారీ ఛార్జీలు, డైమండ్ విలువపై ఫ్లాట్ 17శాతం తగ్గింపును కూడా అందిస్తుంది. సెప్టెంబర్ 2, 2024 వరకు రూ. 5 లక్షల కన్నా ఎక్కువ ఇన్ వాయిస్‌లకు అదనంగా 5 శాతం తగ్గింపును రిలయన్స్ జ్యువెల్స్ అందిస్తుంది.
Read Also : JioBharat Market Share : జియోభారత్ ఫోన్‌కు ఫుల్ డిమాండ్.. రూ.వెయ్యి లోపు ఫోన్ మార్కెట్‌లో 50 శాతం వాటా..!