JioBharat Market Share : జియోభారత్ ఫోన్‌కు ఫుల్ డిమాండ్.. రూ.వెయ్యి లోపు ఫోన్ మార్కెట్‌లో 50 శాతం వాటా..!
JioBharat Market Share : భారతీయ కస్టమర్లను ఆకర్షించిన జియోభారత్ కీప్యాడ్ ఫోన్ దేశంలోని రూ. వెయ్యి లోపు సిగ్మెంట్ ఫోన్ మార్కెట్‌లో 50 శాతం వాటాను సాధించింది.

JioBharat captures 50 Percent market share in sub segment ( Image Source : Google )
JioBharat Market Share : దేశీయ టెలికాం మార్కెట్‌లో రిలయన్స్ జియో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. గత ఏడాదిలో జియోభారత్ అనే స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. ఈ కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్ జియో నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసేలా డిజైన్ చేసింది. ఈ జియో భారత్ ఫోన్ ధర కేవలం రూ.999కే అందించింది. భారతీయ కస్టమర్లను ఆకర్షించిన జియోభారత్ కీప్యాడ్ ఫోన్ దేశంలోని రూ. వెయ్యి లోపు సిగ్మెంట్ ఫోన్ మార్కెట్‌లో 50 శాతం వాటాను సాధించింది.
ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 వార్షిక నివేదికలో వెల్లడించింది. జియోభారత్, సరసమైన కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్ డిజిటల్ సర్వీసులతో ప్రతి భారతీయుడిని శక్తివంతం చేయాలనే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చింది. దేశంలోని 250 మిలియన్ల ఫీచర్ ఫోన్ వినియోగదారులకు మునుపెన్నడూ లేని విధంగా డిజిటల్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది.
ఏడాది క్రితమే లాంచ్ అయిన జియోభారత్ యూపీఐ, జియోసినిమా, జియోటీవీ వంటి ఫీచర్లు, డిజిటల్ సామర్థ్యాలను అందిస్తోంది. సమాజంలోని వివిధ వర్గాల వారు మరిన్నింటిని సాధించేందుకు వీలు కల్పిస్తోంది. ఈ సరసమైన స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను శక్తివంతం చేయడమే కాకుండా హై క్వాలిటీ, సరసమైన డేటాను అందిస్తుంది. సాధారణ యూజర్లకు సైతం ఈ జియోభారత్ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల టెలికం పరిశ్రమ వ్యాప్తంగా టారిఫ్‌లు పెరిగినప్పటికీ, జియో జియోభారత్ యూజర్ల కోసం స్థిరమైన ధరలను అందుబాటులో ఉంచింది.
వినియోగదారులు నెలకు కేవలం రూ. 123తో పూర్తి డిజిటల్ సామర్థ్యాలను అందిస్తుంది. ఇతర మొబైల్ ఆపరేటర్‌ల నుంచి అత్యంత సరసమైన ప్లాన్‌లు నెలకు రూ. 199 నుంచి ప్రారంభమవుతాయి. ఆయా ఫీచర్ ఫోన్‌లు డేటా లేదా ఎల్‌టీఈ వినియోగానికి సపోర్టు ఇవ్వవు. వాయిస్, ఎస్ఎంఎస్ సేవలకు పరిమిత యాక్సెస్‌ను అందిస్తాయి. ఈ ఏడాదిలో జియో ట్రూ5జీ నెట్‌వర్క్‌ను ప్రపంచ రికార్డు సమయంలో దేశమంతటా విస్తరించడం ద్వారా డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచిందని ముఖేష్ అంబానీ తాజా వార్షిక నివేదికలో వాటాదారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Read Also : My Home Akrida : హైదరాబాద్‌లో మరో టాలెస్ట్ టవర్.. 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్ అక్రిదా