Disney Plus Sharing Passwords : నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ ప్లస్.. సెప్టెంబరు నుంచి పాస్‌వర్డ్‌లను షేర్ చేయడం కుదరదు..!
Disney Plus Sharing Passwords : అతి త్వరలో పాస్‌వర్డ్ షేరింగ్‌పై నిషేధాన్ని అమల్లోకి తీసుకురానుంది. డిస్నీ ప్లస్ యూజర్లు ఇకపై కుటుంబ సభ్యులు మినహా బయటి యూజర్లతో పాస్‌వర్డ్‌లను షేర్ చేయలేరు.

Disney Plus to stop users from sharing passwords outside ( Image Source : Google )
Disney Plus Sharing Passwords : ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ ప్లస్ కూడా మరో పోటీదారు అయిన నెట్‌ఫ్లిక్స్ బాటలోనే వెళుతోంది. ఇప్పటికే పాస్‌వర్డ్ షేరింగ్‌పై నిషేధం విధించి నెట్‌ప్లిక్స్ సక్సెస్ సాధించింది. ఇదే విధానాన్ని డిస్నీ ప్లస్ కూడా ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అతి త్వరలో పాస్‌వర్డ్ షేరింగ్‌పై నిషేధాన్ని అమల్లోకి తీసుకురానుంది. డిస్నీ ప్లస్ యూజర్లు ఇకపై తమ ఇంటి వెలుపల పాస్‌వర్డ్‌లను షేర్ చేయలేరు. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. ఆదాయాల కాల్ సందర్భంగా, డిస్నీ సీఈఓ బాబ్ ఇగెర్ ఈ సెప్టెంబర్‌లో మీ ఇంటి వెలుపల ఉన్న ప్లస్ యూజర్లతో పాస్‌వర్డ్‌లను షేర్ చేయడం కుదరదని ప్రకటించారు.
పెయిడ్ షేరింగ్ విధానం :
పాస్‌వర్డ్ షేరింగ్‌ని పరిమితం చేయడంపై ఇప్పటివరకు కొంత అస్పష్టంగా ఉంది. ఫిబ్రవరిలో, డిస్నీ పెయిడ్ షేరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలనే ప్రణాళికలను కంపెనీ వెల్లడించింది. రాబోయే మార్పుల గురించి యూజర్లకు నోటిఫై చేయడం మొదలుపెట్టింది. గత జూన్‌లో, డిస్నీ కొన్ని దేశాల్లో పెయిడ్ షేరింగ్ అమలు చేసింది, అయితే అది అమెరికాలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో పేర్కొనలేదు. ఇప్పుడు, డిస్నీ సెప్టెంబరు నాటికి ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లకు పెయిడ్ షేరింగ్ విస్తరించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ, కంపెనీ డిస్నీ ప్లస్ సబ్‌స్ర్కిప్షన్ అదనపు ధరలను వెల్లడించలేదు.
డిస్నీ కొత్త విధానంతో నెట్‌ఫ్లిక్స్ మాదిరి వ్యూహాన్ని అమలు చేస్తోంది. గత ఏడాదిలో పెయిడ్ షేరింగ్ ప్రవేశపెట్టింది. మరో యూజర్ అకౌంటుకు యాడ్ చేసేందుకు నెలకు 7.99 డాలర్లు అదనంగా వసూలు చేస్తుంది. ప్రారంభ దశలో విమర్శలు వచ్చినప్పటికీ, పాస్‌వర్డ్ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ నిషేధాన్ని ఇతర యూజర్లు స్వాగతించారు. ఇప్పటివరకు వచ్చిన నోటిఫికేషన్‌లకు సంబంధించి డిస్నీ యూజర్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని ఇగెర్ పేర్కొన్నారు.
సబ్‌స్ర్కిప్షన్ ధరల పెంపు కూడా :
పాస్‌వర్డ్-షేరింగ్‌పై నిషేధంతో పాటు అదనంగా, డిస్నీ అక్టోబర్‌లో డిస్నీ ప్లస్, హులు, ఈఎస్‌పీఎన్ ప్లస్‌ల సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచాలని భావిస్తోంది. ధరల పెంపుదల వల్ల సబ్‌స్క్రైబర్‌ల గణనీయమైన నష్టం జరగదని ఇగెర్ విశ్వాసం వ్యక్తం చేశారు, ఏబీసీ న్యూస్ లైవ్, క్యూరేటెడ్ ప్లేలిస్ట్‌ల వంటి కొత్త కంటెంట్ అందించాలని కంపెనీ యోచిస్తోంది. డిస్నీ ప్లస్, హు, ఈఎస్‌పీఎన్ ప్లస్ ఈ త్రైమాసికంలో మొదటిసారి లాభాలను ఆర్జించడంతో ధరలను పెంచుతున్నాయి. డిస్నీ పెయిడ్ షేరింగ్, హై సబ్‌స్క్రిప్షన్ ఖర్చుల ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలని కంపెనీ నిర్ణయించుకుంది.
నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ స్ట్రీమింగ్ సర్వీసులను ఆర్థికంగా వృద్ధిచెందేలా పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిస్నీలో ఈ కొత్త మార్పులతో సబ్‌స్క్రైబర్లు కొత్త రూల్స్, అధిక ధరలను భరించాల్సి ఉంటుంది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా స్ట్రీమింగ్ దిగ్గజం వ్యూహాన్ని అమలు చేస్తోంది.
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ తన సబ్‌స్క్రైబర్ బేస్, రాబడిని పెంచడానికి పాస్‌వర్డ్ షేరింగ్‌ను తగ్గించింది. స్ట్రీమింగ్ దిగ్గజం ఒకే కుటుంబానికి అకౌంట్ యాక్సెస్‌ను పరిమితం చేసింది. ఈ చర్యతో కొంతమంది వినియోగదారుల నుంచి విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ విజయవంతమైంది. పేమెంట్ సబ్‌స్ర్కిప్షన్లలో గణనీయమైన పెరుగుదలను సాధించింది.