Reliance Jio Plans : రిలయన్స్ జియో యూజర్లకు అలర్ట్.. ఇకపై రెండు వార్షిక ప్లాన్లు మాత్రమే.. బెనిఫిట్స్ ఇవే..!

Reliance Jio Plans : ఈ ప్లాన్ అదనపు బెనిఫిట్స్‌తో అన్‌లిమిటెడ్5జీ డేటా, జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సర్వీసులను అందిస్తుంది. ఈ ప్లాన్ సర్వీస్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది.

Reliance Jio Only has Two Annual Packs Now, Check Them Out

Reliance Jio Plans : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం రెండు వార్షిక ప్రీపెయిడ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. ఇటీవల మొబైల్ టారిఫ్ పెంపు తర్వాత అనేక కొత్త ఆప్షన్లను అందిస్తోంది. అయితే, కేవలం రెండు వార్షిక ప్లాన్లను మాత్రమే అందిస్తోంది.

Read Also : SpaceX Satellites Crash : స్పేస్ఎక్స్‌కు తీరని ఎదురుదెబ్బ.. భూమిపై కూలిపోనున్న 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు!

ఉదాహరణకు, ఇప్పుడు 1.5జీబీ లేదా 2జీబీ రోజువారీ డేటాను అందించే వార్షిక ప్రీపెయిడ్ ప్యాక్ అందుబాటులో లేదు. ఇప్పుడు రెండు వార్షిక ప్యాక్‌లు మాత్రమే ఉన్నాయి. అందులోనూ ప్లాన్లు చాలా ఖరీదైనవి. జియో వార్షిక ప్యాక్‌లతో రీఛార్జ్ చేయడం అనేది వినియోగదారులు గతంలో చేసినంతగా ఉండదని గమనించాలి. ప్రస్తుతం జియో అందించే రెండు వార్షిక ప్లాన్‌లు రూ. 3599, రూ. 3999గా ఉండగా.. ఈ ప్లాన్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రిలయన్స్ జియో రెండు వార్షిక ప్లాన్లు :
రిలయన్స్ జియో రూ. 3599 ప్లాన్ :
రిలయన్స్ జియో రూ. 3599 ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్/రోజు, 2.5జీబీ రోజువారీ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ అదనపు బెనిఫిట్స్‌తో అన్‌లిమిటెడ్5జీ డేటా, జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సర్వీసులను అందిస్తుంది. ఈ ప్లాన్ సర్వీస్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది.

రిలయన్స్ జియో రూ. 3999 ప్లాన్ :
రిలయన్స్ జియో రూ. 3999 ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్/రోజు, 2.5జీబీ రోజువారీ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అదనపు బెనిఫిట్స్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా, జియోటీవీ మొబైల్ యాప్ ద్వారా ఫ్యాన్‌కోడ్, జియోసినిమా, జియోటీవీ, జియోక్లౌడ్ సర్వీసులను పొందవచ్చు. ఈ ప్లాన్ సర్వీస్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది.

రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం కొత్త వార్షిక ప్లాన్‌లను ఎప్పుడు ప్రవేశపెట్టనుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు ప్లాన్‌లు అందరికీ సరిపోకపోవచ్చు. రెండు ప్లాన్‌లు 2.5జీబీ రోజువారీ డేటాను అందిస్తాయి. అందువల్ల, మీకు తక్కువ రోజువారీ డేటా అందించే ప్లాన్ కావాలంటే.. అలాంటి ఆప్షన్ లేదు. అయితే, 1.5జీబీ రోజువారీ డేటాకు తక్కువ-కాల వ్యాలిడిటీ ప్యాక్‌లతో రీఛార్జ్ చేయొచ్చు.

Read Also : Apple iPhone 15 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లు, మరెన్నో డీల్స్..!

ట్రెండింగ్ వార్తలు