India vs Sri Lanka : టీమ్ఇండియా ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్ జూలై 27 నుంచి, వన్డే సిరీస్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లలో పాల్గొనే భారత జట్లను బీసీసీఐ నేడు (మంగళవారం జూలై 16న) ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. కాగా.. లంక పర్యటనతోనే కోచ్‌గా గంభీర్ బాధ్యతలను చేపట్టనున్నాడు.
ఇదిలా ఉంటే.. వ్యక్తిగత కారణాలతో లంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ఇప్పటికే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. ఇందుకు బీసీసీఐ కూడా అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే.. వన్డే సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలతో పాటు జస్‌ప్రీత్ బుమ్రాలను ఆడాలని గంభీర్ కోరినట్లుగా రిపోర్టులు చెబుతున్నాయి.
Rishabh Pant : ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకివ్వనున్న రిషబ్ పంత్..?
కాగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇద్దరూ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వీరిద్దరు ఇప్పటి వరకు గంభీర్ అభ్యర్థనపై స్పందించనట్లుగా తెలుస్తోంది. ఇక బుమ్రా మూడు ఫార్మాట్లలో ఆడేందుకు ఆసక్తిని వ్యక్తం చేసినట్లుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
ఇక టీ20 క్రికెట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడంతో కెప్టెన్‌గా ఎవరిని నియమిస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. హార్దిక్‌ను కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను వైస్‌కెప్టెన్‌గా నియమించనున్నట్లు సమాచారం. పొట్టి ప్రపంచకప్‌లో రాణించిన కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ లకు శ్రీలంక పర్యటనకు ఎంపిక అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్ షెడ్యూల్..
టీ20 సిరీస్..
తొలి టీ20 – జూలై 27న
రెండ టీ20 – జూలై 28న
మూడో టీ20 – జూలై 30న
వన్డే సిరీస్..
తొలి వన్డే – ఆగస్టు 2న
రెండో వన్డే – ఆగస్టు 4న
మూడో వన్డే – ఆగస్టు 7న
టీ20 సిరీస్‌లోని అన్ని మ్యాచులు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. వన్డే సిరీస్‌లోని మ్యాచులు అన్ని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జరగనున్నాయి.