Cars Discount Sale : కొత్త కారు కొంటున్నారా? ఈ బ్రాండ్ మోడల్ కార్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఏయే కార్లపై ధర ఎంత తగ్గిందంటే?

Cars Discount Sale : మీకోసం లేదా మీ కుటుంబంలో ఎవరికైనా కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. వర్షాకాలంలో ఈసారి కార్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Maruti Suzuki, Hyundai, Tata Motors and others offer discounts on cars as sales slowdown ( Image Source : Google )

Cars Discount Sale : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ప్రస్తుత ఆటోమొబైల్ మార్కెట్లో కార్లపై భారీ డిస్కౌంట్ల వర్షం కురుస్తోంది. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఇతరులు అమ్మకాలు మందగించడంతో కార్లపై డిస్కౌంట్లను అందిస్తున్నాయి కంపెనీలు.

Read Also : Ola CEO Bhavish Aggarwal : వారానికి 70 గంటల పని.. ఇన్ఫోసిస్ మూర్తిని సమర్థించిన ఓలా సీఈఓ.. ట్రోల్స్ చేసినా పట్టించుకోను!

మీకోసం లేదా మీ కుటుంబంలో ఎవరికైనా కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. వర్షాకాలంలో ఈసారి కార్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహింద్రా వంటి అనేక ప్రధాన వాహన తయారీదారులు విస్తృత శ్రేణి కార్లపై డిస్కౌంట్లను ప్రకటించారు. ఈ కార్లలో మీకు నచ్చిన మోడల్ కారు ఎంచుకుని కొనేసుకోండి.

మారుతీ సుజుకి :
భారత అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి జిమ్నీ, బాలెనో, గ్రాండ్ విటారా మరిన్ని కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఇటీవల కార్ల విక్రయాలు మందగించడంతో జిమ్నీ, జీటా వేరియంట్‌కు గరిష్టంగా రూ. 1.75 లక్షల వరకు, ఆల్ఫా వేరియంట్‌కి రూ. 1.8 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది.

సంస్థ అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన బాలెనో వేరియంట్‌లను బట్టి రూ. 35వేల నుంచి రూ. 40వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఎఎంటీ వేరియంట్ అత్యధిక తగ్గింపును పొందింది. గ్రాండ్ విటారా ఎస్‌యూవీ హైబ్రిడ్ వేరియంట్‌కు రూ. 55వేల తగ్గింపును పొందింది. ఇతర వేరియంట్‌లలో రూ. 30వేల వరకు తగ్గింపు పొందాయి. కంపెనీ లేటెస్ట్ ఆఫర్ ఫ్రాంక్స్ కూడా రూ. 35వేల వరకు తగ్గింపు పొందింది.

టాటా మోటార్స్ :
టాటా మోటార్స్ పాపులర్ ఈవీ కార్లలో నెక్సాన్ ఈవీ రూ. 1.3 లక్షల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. నెక్సాన్ ఈవీ ఎంపోవర్డ్ ప్లస్ భారీ తగ్గింపును పొందింది. అయితే, ఇతర కారు వేరియంట్‌లు రూ. 60వేల వరకు తగ్గింపు పొందాయి. కంపెనీ సరసమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, పంచ్ ఈవీ కూడా వేరియంట్‌ల ఆధారంగా రూ. 10వేల నుంచి రూ. 30వేల వరకు తగ్గింపు పొందింది. కంపెనీ ప్రీమియం ఎస్‌యూవీలలో సఫారి, హారియర్‌లు కూడా రూ. 1.3 లక్షల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ :
దేశంలోని అగ్రగామి ఆటోమేకర్లలో ఒకటైన హ్యుందాయ్ కూడా డిస్కౌంట్లను ప్రకటించింది. కంపెనీ ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ ఐ20 రూ. 30వేల వరకు డిస్కౌంట్, రూ. 10వేలు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది. వెర్నా సెడాన్ రూ. 20వేల వరకు డిస్కౌంట్, రూ. 15వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌తో విక్రయిస్తోంది. కంపెనీ నుంచి ప్రీమియం ఎస్‌‌యూవీ, టక్సన్ రూ. 2 లక్షల వరకు తగ్గింపుతో అందిస్తోంది. ఈ ధర మోడల్‌ బట్టి మారుతుంది.

మహీంద్రా :
మహీంద్రా అండ్ మహీంద్రా ప్రీమియం XUV700 ఎఎక్స్7 రేంజ్ ధర తగ్గింపును అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు రూ. 2 లక్షల తగ్గింపు తర్వాత రూ. 19.5 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంటుంది.

ఎంజీ మోటార్ :
ఎంజీ హెక్టర్‌పై రూ. 55వేల బోనస్‌తో పాటు రూ. 75వేల వరకు తగ్గింపును ఎంజీ మోటార్ ప్రకటించింది. ఎంజీ ZS ఈవీ రూ.1.5 లక్షల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. అయితే, ప్రీమియం గ్లోస్టర్ ఎస్‌యూవీ రూ. 2 లక్షల వరకు తగ్గింపుతో అందిస్తోంది.

Read Also : iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ వస్తోంది.. మూడు 48ఎంపీ రియర్ కెమెరాలు, మరెన్నో అప్‌గ్రేడ్ ఫీచర్లు..!

ట్రెండింగ్ వార్తలు