Ola CEO Bhavish Aggarwal : వారానికి 70 గంటల పని.. ఇన్ఫోసిస్ మూర్తిని సమర్థించిన ఓలా సీఈఓ.. ట్రోల్స్ చేసినా పట్టించుకోను!

Ola CEO Bhavish Aggarwal : ఇన్ఫోసిస్ మూర్తి 70 గంటల పని వారం అని చెప్పినప్పుడు నేను బహిరంగంగా మద్దతు పలికాను.. కానీ, నేను ట్రోల్ అయ్యానంటూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ పోడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చారు.

Ola CEO Bhavish Aggarwal : వారానికి 70 గంటల పని.. ఇన్ఫోసిస్ మూర్తిని సమర్థించిన ఓలా సీఈఓ.. ట్రోల్స్ చేసినా పట్టించుకోను!

Ola CEO Bhavish Aggarwal backs Narayana Murthy’s 70-hour work week advice ( Image Source : Google )

Ola CEO Bhavish Aggarwal : ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 70 గంటల పని విధానాన్ని మళ్లీ సమర్థించారు. ఓలా బాస్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ..“మూర్తి (70 గంటల పని వారం) అని చెప్పినప్పుడు.. నేను బహిరంగంగా మద్దతు పలికాను. దాంతో సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ అయ్యాను. కానీ, నేను నేను వాటిని పట్టించుకోను.

Read Also : Jio vs Airtel 5G Plans : జియో, ఎయిర్‌టెల్ చౌకైన 5జీ మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ధర, వ్యాలిడిటీ వివరాలివే..!

ఎందుకంటే.. ఒక తరం తపస్సు చేయవలసి ఉంటుంది. తద్వారా ప్రపంచంలోనే నంబర్ వన్ దేశాన్ని, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నిర్మించగలం అనే బలమైన నమ్మకం నాకు ఉంది. అలాగే, పని-జీవిత సమతుల్యత భావనతో నేను ఏకీభవించను. ఎందుకంటే.. మీరు మీ పనిని ఆస్వాదిస్తూ ఉంటే.. మీరు జీవితంలో కూడా ఆనందాన్ని పొందుతారు. పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు’’ అని అగర్వాల్ చెప్పుకొచ్చారు.

అంతకుముందు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. గడచిన 2 నుంచి 3 దశాబ్దాలలో అద్భుతమైన పురోగతిని సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువకులు వారానికి 70 గంటలు పని చేయాలని సలహా ఇచ్చారు. అది కాస్తా దేశంలో పెద్ద చర్చకు దారితీసింది.

వారానికి 90 గంటలు పనిచేసేవాడిని : నారాయణ మూర్తి 
నారాయణ మూర్తి దీనిపై వివరణ కూడా ఇచ్చారు. “నేను పదవీ విరమణ చేసే వరకు వారానికి 85 గంటల నుంచి 90 గంటలు పని చేసేవాడిని. నేను 1961లో నా పూర్వ యూనివర్శిటీ నుంచి స్కాలర్‌షిప్ పొందాను. ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్ళిన నా స్నేహితులందరికీ వారి ఫీజుల పరంగా ప్రభుత్వం నుంచి చాలా సహాయం లభించింది.

అందువల్ల, భారత్‌లో పన్ను చెల్లింపుదారుల నుంచి దేశం నుంచి చాలా ప్రయోజనం పొందుతున్న మనలో పేద వర్గాల జీవితాల మెరుగుదలకు చాలా కష్టపడి పనిచేయడం చాలా పెద్ద బాధ్యత అని నా అభిప్రాయం. సమాజం కాబట్టి నేను చింతించను. వీఐటీ ఎంబీఏ ప్రోగ్రామ్‌తో మీ కెరీర్‌ను ఎలివేట్ చేసుకోండి’’ అంటూ మూర్తి యువకులను ఉద్దేశించి సూచనలు చేశారు.

Read Also : iQoo Neo 9s Pro Plus : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?