iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ వస్తోంది.. మూడు 48ఎంపీ రియర్ కెమెరాలు, మరెన్నో అప్‌గ్రేడ్ ఫీచర్లు..!

iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌తో పాటు ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ రెండూ టెట్రాప్రిజం టెలిఫోటో లెన్స్‌లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ వస్తోంది.. మూడు 48ఎంపీ రియర్ కెమెరాలు, మరెన్నో అప్‌గ్రేడ్ ఫీచర్లు..!

iPhone 17 Pro Max to get big camera upgrade ( Image Source : Google )

iPhone 17 Pro Max : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలో ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ లాంచ్ కానుంది. ప్రసిద్ధ ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో ప్రకారం.. మొత్తం మూడు 48ఎంపీ రియర్ కెమెరాలతో ముఖ్యమైన కెమెరా అప్‌గ్రేడ్‌ను కలిగి ఉండనుంది. రాబోయే ఐఫోన్ ఫ్లాగ్‌షిప్ డివైజ్ ముఖ్యంగా అప్‌గ్రేడ్ చేసిన టెట్రాప్రిజం కెమెరా టెక్నాలజీతో రానుంది.

Read Also : iQoo Neo 9s Pro Plus : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో 48ఎంపీ టెట్రాప్రిజం కెమెరా అమర్చిందని, అత్యుత్తమ ఫొటో క్వాలిటీ, అడ్వాన్స్‌డ్ జూమ్ సామర్థ్యాలతో రూపొందించిందని కువో వెల్లడించారు. ఈ కొత్త కెమెరా సిస్టమ్ 1/2.6-అంగుళాల 48ఎంపీ సీఐఎస్ సెన్సార్‌ను ఉపయోగిస్తుందని నివేదించింది. ఈ ఏడాది లాంచ్ కానున్న ఐఫోన్ 16 ప్రో మోడల్ 1/3.1-అంగుళాల 12ఎంపీ సెన్సార్ కన్నా అప్‌గ్రేడ్ కలిగి ఉండనుంది.

ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌తో పాటు ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ రెండూ టెట్రాప్రిజం టెలిఫోటో లెన్స్‌లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఈ టెక్నాలజీతో గతంలో పెద్ద ప్రో మాక్స్ మోడల్‌లకు మాత్రమే కాకుండా రెండు ప్రో వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని నివేదించింది. ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు కనీసం 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 25ఎక్స్ డిజిటల్ జూమ్‌ను అందించగలవని అంచనా వేసింది.

టెట్రాప్రిజం కెమెరాతో ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ :
అప్‌గ్రేడ్ చేసిన టెట్రాప్రిజం కెమెరాతో ఐఫోన్ 17 ప్రో మాక్స్‌కు ప్రత్యేకంగా ఉండే అవకాశాన్ని కూడా కువో ప్రస్తావించారు. ఈ ప్రత్యేకతను కలిగి ఉంటే.. అడ్వాన్స్‌డ్ కెమెరా టెక్నాలజీతో 2026లో ఐఫోన్ 18ప్రో మోడల్‌లకు విస్తరించే అవకాశం ఉంది. అప్‌గ్రేడ్ చేసిన (Tetraprism) కెమెరా మాడ్యూల్ ఎత్తును తగ్గించడం ద్వారా తక్కువ ఫారమ్ ఫ్యాక్టర్‌తో కొత్త ప్రిజమ్‌లను రూపొందించే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో, ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు 48ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కూడా కలిగి ఉంటాయని ఓ నివేదిక నివేదించింది.

ఈ అప్‌గ్రేడ్ ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ మెయిన్, అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లతో సహా పూర్తిగా 48ఎంపీ బ్యాక్ కెమెరా సిస్టమ్‌తో రానుంది. ప్రస్తుత ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌తో పోలిస్తే.. 48ఎంపీ మెయిన్, 12ఎంపీ అల్ట్రా-వైడ్, 12ఎంపీ టెలిఫోటో లెన్స్‌లను కలిగి ఉన్నాయి. ఐఫోన్ 16 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఆపిల్ సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్‌లను లాంచ్ చేసిన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. 2024 ఫోన్లలో కూడా అదే జరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : Ola CEO Bhavish Aggarwal : వారానికి 70 గంటల పని.. ఇన్ఫోసిస్ మూర్తిని సమర్థించిన ఓలా సీఈఓ.. ట్రోల్స్ చేసినా పట్టించుకోను!