Samsung Galaxy S23 : భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఎంత తగ్గనుందంటే?

రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో భారత మార్కెట్లో ఈ శాంసంగ్ ఫోన్‌పై గణనీయమైన ధర తగ్గింపును అందించనుంది.

Samsung Galaxy S23 Price : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కొత్త ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్‌పై భారీ తగ్గింపు అందించనుంది. రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో భారత మార్కెట్లో ఈ శాంసంగ్ ఫోన్‌పై గణనీయమైన ధర తగ్గింపును అందించనుంది. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై సోమవారం (ఏప్రిల్ 29) ప్రారంభ ధర నుంచి రూ. 20వేలు ధర తగ్గింపు పొందనుంది.

Read Also : Samsung Neo TV Models : శాంసంగ్ నుంచి ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫీచర్లతో 2 కొత్త నియో క్యూఎల్ఈడీ టీవీ మోడల్స్..!

ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీల ద్వారా చేసే కొనుగోళ్లకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు, అదనపు తగ్గింపులను పొందవచ్చు. గెలాక్సీ ఎస్23 గెలాక్సీ ఫోన్లపై కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 మొబైల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పవర్ అందిస్తుంది. డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ ప్రారంభ ధర రూ.44,999తో అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఆఫర్‌లో బ్యాంక్ ఆధారిత తగ్గింపు రూ. 2వేలు ఉంటుంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్, శాంసంగ్ వెబ్‌సైట్‌లో మే 2న సేల్ మొదలుకానుంది. గత ఏడాది ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్ రూ. 74,999 బేస్ వేరియంట్, రూ. 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ.79,999కు పొందవచ్చు.

బ్యాంకు కార్డులపై మరిన్ని డిస్కౌంట్లు :
ఈ ఏడాది ప్రారంభంలో శాంసంగ్ బేస్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ ఆప్షన్, 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 69,999కు పొందవచ్చు. సాధారణ ధర తగ్గింపుతో పాటు, కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా తక్కువ ధరకు గెలాక్సీ ఎస్23ని పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సర్వీసును కూడా పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై మరిన్ని డిస్కౌంట్లు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ 6.1-అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేను 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. గెలాక్సీ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్8 జనరేషన్ 2 మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లో రన్ అవుతుంది. 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ వైడ్ యాంగిల్ సెన్సార్, 12ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 10ఎంపీ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

12ఎంపీ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది. 25డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్, 15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 3,900ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. గెలాక్సీ ఎస్24 సిరీస్‌తో గెలాక్స్ ఏఐ ఫీచర్లు ఇప్పుడు గెలాక్సీ ఎస్23లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సూట్‌లో సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, ఫోటో అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Read Also : Samsung Galaxy S24 : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ 128జీబీ వేరియంట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!

ట్రెండింగ్ వార్తలు