Samsung Galaxy S24 Series : మూడు వేరియంట్లలో శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Samsung Galaxy S24 Series Launched : భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్ అయింది. కంపెనీ స్టాండర్డ్, ప్లస్, అల్ట్రా అనే మొత్తం మూడు మోడళ్లను ప్రకటించింది. ధర, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Samsung Galaxy S24 series launched _ Price, specifications, and other details

Samsung Galaxy S24 Series Launched : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయింది. కంపెనీ స్టాండర్డ్, ప్లస్, అల్ట్రా అనే మొత్తం మూడు మోడళ్లను ప్రకటించింది. అందులో ప్రతి వేరియంట్ యూజర్లకు విభిన్న అవసరాలకు తగినట్టుగా ధర భిన్నంగా ఉంటుంది. మూడింటిలో అత్యంత ప్రీమియం వేరియంట్ అల్ట్రా మోడల్ క్వాల్‌కామ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ని ఉపయోగిస్తోంది. ఇతర మోడల్‌లు ఎక్సినోస్ ఎస్ఓసీని కలిగి ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ధర, స్పెసిఫికేషన్‌లను ఓసారి పరిశీలిద్దాం..

శాంసంగ్ గెలాక్సీ ఎస్24, ఎస్24+, ఎస్24 అల్ట్రా : ధర వివరాలివే :
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ధర 799.99 డాలర్లు (దాదాపు రూ. 66,538), అయితే గెలాక్సీ ఎస్24+ మోడల్ ధర 999.99 డాలర్లు (దాదాపు రూ. 83,173). గెలాక్సీ ఎస్24 అల్ట్రా 1,299.99 డాలర్లు (దాదాపు రూ. 1,08,125) వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త శాంసంగ్ ఫోన్‌ల ఇండియా ధరలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Read Also : Lamborghini Sales 2023 : లగ్జరీ స్పోర్ట్స్ బ్రాండ్ లంబోర్ఘిని రికార్డు సేల్స్ : కంపెనీ చరిత్రలోనే మొదటిసారిగా 10వేల కార్ల విక్రయాలు!

శాంసంగ్ గెలాక్సీ ఎస్24, ఎస్24+, ఎస్24 అల్ట్రా : స్పెషిఫికేషన్లు, ముఖ్య ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 6.2-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ డైనమిక్ అమోల్డ్ స్క్రీన్‌ను 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. శాంసంగ్ ఇంటర్నల్ ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. 256జీబీ వరకు స్టోరేజీ ఆప్షన్ల ద్వారా సపోర్టు ఇస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 30ఎక్స్ డిజిటల్ జూమ్‌తో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10ఎంపీ టెలిఫోటో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. చివరకు హుడ్ కింద పెద్ద 4,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Samsung Galaxy S24 series launched

మిడిల్ చైల్డ్ అయిన గెలాక్సీ ఎస్24+, 1440 x 3120 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లేతో 1హెచ్‌జెడ్ నుంచి 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ డివైజ్ ప్రామాణిక మోడల్ మాదిరిగా ఎక్సినోస్ 2400 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 512జీబీ స్టోరేజీ ఆప్షన్లతో అందిస్తోంది. ఆప్టిక్స్ పరంగా.. గెలాక్సీ ఎస్24 మాదిరిగా అదే ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్ ఉంది. 4,900ఎంఎహెచ్ బ్యాటరీ యూనిట్ కూడా ఉంది.

సౌత్ కొరియన్ బ్రాండ్ నుంచి అత్యంత ప్రీమియం ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా, 6.8-అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. 12జీబీ ర్యామ్‌తో గరిష్టంగా 1టీబీ స్టోరేజీ ఆప్షన్ల ద్వారా బ్యాకప్ పొందవచ్చు.

ఆప్టిక్స్ పరంగా.. 200ఎంపీ ప్రైమరీ కెమెరాతో సహా క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ కెమెరా యూనిట్‌లో 12ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ టెలిఫోటో కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 10ఎంపీ టెలిఫోటో సెన్సార్ కూడా ఉన్నాయి. కంపెనీ 100ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్ట్‌కు సపోర్టు ఇచ్చింది. ఈ ప్రీమియం ఫోన్ ఐఫోన్ 15 ప్రో మోడల్‌ల మాదిరిగానే టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. హుడ్ కింద 5,000ఎంఎహెచ్ బ్యాటరీ కూడా ఉంది.

Samsung Galaxy S24 series launched Price

రియల్ టైమ్.. ఏఐ పవర్డ్ ఫీచర్లు :
కొత్త శాంసంగ్ ఫోన్‌లలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లలో కాల్‌లు లేదా మెసేజ్‌లు రియల్ టైమ్ ట్రాన్సులేషన్ వంటి కొన్ని ఏఐ పవర్డ్ ఫీచర్లు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా ఉంది. ఫోటోలో ఉన్న దేనినైనా త్వరగా సెర్చ్ చేసేందుకు అనుమతిస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేస్తున్న ఏదైనా స్టోరీ త్వరగా అందించే బ్రౌజర్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. ఒక ఫ్రేమ్ నుంచి వస్తువులను ఎడిట్ చేయడం లేదా ఫొటోను పాడు చేయకుండా ఎక్కడికైనా పంపడానికి ఆప్షన్లను కూడా పొందవచ్చు. ఈ కొత్త ఫోన్‌లు మెరుగైన అనుభవం కోసం మెరుగైన హెచ్‌డీఆర్, ఇతర ఏఐ-ఆధారిత ఫీచర్‌లను కూడా అందిస్తాయి.

ఏడేళ్ల ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ :
అన్ని కొత్త శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు 7 ఏళ్ల మేజర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను 7 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందుకోనున్నాయి. కంపెనీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఛార్జర్‌ను అందించడం లేదు. ఏదైనా ఒక ఛార్జర్ కొనుగోలు చేయడానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అన్ని స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఐపీ68 రేటింగ్‌తో ఉంటాయి. స్టాండర్డ్ మోడల్‌కు 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టు అందిస్తుంది. అలాగే ప్లస్, అల్ట్రా వేరియంట్‌లు 45డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను పొందుతాయి.

Read Also : Apple No.1 Phone Seller : ఎట్టకేలకు శాంసంగ్‌ను అధిగమించిన ఆపిల్.. ప్రపంచంలోనే నెం.1 స్మార్ట్‌ఫోన్ సెల్లర్‌‌గా అవతరణ!

ట్రెండింగ్ వార్తలు