Tech Tips in Telugu : ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై వీడియోలను ‘నోట్స్’గా పంపుకోవచ్చు!

Tech Tips in Telugu : ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఇప్పుడు వీడియోలను నోట్స్‌గా షేర్ చేయవచ్చు: కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Tech Tips in Telugu : ప్రముఖ మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది. ఇప్పుడు, ఇన్‌స్టాగ్రామ్ నోట్స్ ఫీచర్‌కి మరో అప్‌గ్రేడ్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా యూజర్లు నోట్స్‌కు షార్ట్ వీడియోలను షేరింగ్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్ సెక్షన్ నుంచి ఎగువన షార్ట్ టెక్స్ట్ నోట్స్ షేర్ చేసుకోవచ్చు.

Read Also : JioTV Premium Plans : జియో కొత్త జియోటీవీ ప్రీమియం ప్లాన్లు ఇదిగో.. మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్, ప్రారంభ ధర ఎంతంటే?

గత ఏడాదిలో నోట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అప్పటినుంచి ప్లాట్‌ఫారమ్ నోట్స్ ఫీచర్‌కి అనేక అప్‌డేట్‌లను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు షార్ట్ మ్యూజిక్, వాయిస్ నోట్స్‌ను షేర్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. లేటెస్ట్ నోట్స్ ఫీచర్‌కు వినియోగదారులు డైరెక్ట్ మెసేజ్ సెక్షన్ ఎగువన 2-సెకన్ల షార్ట్ వీడియో నోట్‌లను షేర్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ నోట్స్ ఈ విస్తరణతో వినియోగదారులకు తమ అప్‌డేట్‌లలో డైనమిక్ ఎలిమెంట్‌ను షేర్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది.

ఈ కొత్త వీడియో స్టేటస్ ఫీచర్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వీడియో నోట్స్ ఎలా అప్‌లోడ్ చేయాలంటే?
1. మీ డైరెక్ట్ మెసేజింగ్ సెక్షన్ యాక్సెస్ చేయండి.
ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేసి మీ ఇన్‌బాక్స్‌కి నావిగేట్ చేయండి.
2. నోట్స్‌లో మీ ప్రొఫైల్ ఫొటోను ఎంచుకోండి.
నోట్స్ ట్రేలో ఉన్న మీ ఫొటోపై ట్యాప్ చేయండి. ఆపై రికార్డింగ్ ప్రాసెస్ ప్రారంభించడానికి కెమెరా ఐకాన్ క్లిక్ చేయండి.

3. 2-సెకన్ల వీడియోను రికార్డ్ చేయండి :
2-సెకన్ల వీడియోని క్యాప్చర్ చేయడానికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఉపయోగించండి. మీకు నచ్చిన వీడియోను రికార్డు చేసి నోట్స్‌గా పంపుకోవచ్చు.

4. టెక్స్ట్ కూడా యాడ్ చేయండి :
పోస్ట్ చేసే ముందు.. సందర్భం కోసం టెక్స్ట్ క్యాప్షన్ యాడ్ చేయడం ద్వారా మీ వీడియో నోట్స్ మెరుగుపరచండి.

Tech Tips in Telugu  

5. మీ వీడియో నోట్‌ని పోస్ట్ చేయండి :
మీ వీడియో నోట్‌ని పోస్ట్ చేయండి. మీ సన్నిహితులు, ఫాలోవర్లకు 24 గంటల పాటు కనిపిస్తుంది.

వీడియో నోట్స్‌కి ఎలా రిప్లయ్ ఇవ్వాలి :
1. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి.. మీ డైరెక్ట్ మెసేజ్ సెక్షన్‌కు వెళ్లండి
ఇన్‌స్టాగ్రామ్‌లో మీ డైరెక్ట్ మెసేజ్‌లకు (DM) నావిగేట్ చేయండి.

2. రిప్లయ్ ఇవ్వడానికి నోట్స్ ఎంచుకోండి :
రిప్లయ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయడం ద్వారా మీరు రిప్లయ్ ఇవ్వాలనుకునే వీడియో నోట్‌పై క్లిక్ చేయండి.

3. మీ రిప్లయ్ టైమ్ ఎంచుకోండి :
మీ ఫొటో, వీడియో, జిఫ్ లేదా ఆడియో నోట్స్ పంపడానికి మీ మెసేజ్ టైప్ చేయండి లేదా ఆప్షన్లను ఎంచుకోండి.

4. మీ రిప్లయ్ పంపండి :
మీ రిప్లయ్ పంపడం ద్వారా ప్రాసెస్ పూర్తి చేయండి. ఒరిజినల్ వీడియో నోట్ 24-గంటల విజిబిలిటీ విండోకు రిప్లయ్ లిమిట్ ఉందని గమనించండి.

గుర్తుంచుకోవలసిన విషయాలు :
వీడియో నోట్ ఫీచర్లు : ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు కాకుండా, ఈ వీడియో నోట్స్ 2 సెకన్లకు పరిమితమయ్యాయి. యాప్ ముందు కెమెరాను ఉపయోగించి మాత్రమే రికార్డ్ అయ్యాయి. అదనంగా మీ వీడియో నోట్‌తో పాటు టెక్స్ట్ క్యాప్షన్ కూడా చేర్చవచ్చు.
వీడియో నోట్స్ రిప్లయ్ ఇవ్వండి : ఫోటోలు, వీడియోలు, ఆడియో సందేశాలు, స్టిక్కర్‌లు జిఫ్ సహా వివిధ మీడియా టైప్‌లతో వీడియో నోట్స్ పంపుకోవచ్చు.

Read Also : Elon Musk Grok AI Chatbot : చాట్‌జీపీటీ, బార్డ్ ఏఐకి పోటీగా ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్.. ఇప్పుడు భారత్‌లో కూడా యాక్సస్ చేయొచ్చు!

ట్రెండింగ్ వార్తలు