ద్విచక్రవాహనాలు నడిపేవారందరూ హెల్మెట్ తప్పకుండా ధరించాల్సిందే: ఏపీ హైకోర్టు

AP High court: ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడం కూడా..

ద్విచక్రవానాలు నడిపేవారందరూ హెల్మెట్ తప్పకుండా ధరించాల్సిందేనంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ద్విచక్రవాహదారులు హెల్మెట్ ధరించకపోతే పోలీసులు కేసులు నమోదు చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడం కూడా మరణాలకు కారణమని న్యాయవాది తాండవ యోగేశ్ పిటిషన్ వేయడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

అలాగే, పోలీసులు తనిఖీలు చేసే సమయంలో బాడీ కెమెరా ధరించడం కూడా తప్పనిసరని పేర్కొన్నారు. చాలా మంది యువత జుట్టు పాడవుతుందని, సౌకర్యంగా ఉండబోదని హెల్మెట్లు ధరించకుండానే బైకులు నడిపిస్తుంటారు. ప్రమాదం జరిగితే హెల్మెట్ రక్షిస్తుంది. హెల్మెట్ పెట్టుకుని వాహనాలు నడిపితే తలకు దెబ్బలు తగలకుండా చూసుకోవచ్చు. అయినప్పటికీ చాలా మంది కోరి ప్రమాదాలను తెచ్చుకుంటున్నట్లు వ్యవహరిస్తున్నారు.

Also Read: తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ.. కీలక వివరాలు తెలిపిన మంత్రి దామోదర రాజనర్సింహా

ట్రెండింగ్ వార్తలు