తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ.. కీలక వివరాలు తెలిపిన మంత్రి దామోదర రాజనర్సింహా
Telangana junior doctors: ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లను నెరవేరుస్తున్నామని చెప్పారు.
![తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ.. కీలక వివరాలు తెలిపిన మంత్రి దామోదర రాజనర్సింహా తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ.. కీలక వివరాలు తెలిపిన మంత్రి దామోదర రాజనర్సింహా](https://10tv.in/wp-content/uploads/2024/06/New-Project-2-5.jpg)
Telangana junior doctors
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. జూడాల సమస్యలను అర్థం చేసుకున్నామని తెలిపారు. వారు ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లను నెరవేరుస్తున్నామని చెప్పారు.
మొత్తం 3 మెడికల్ కాలేజీలకు సంబంధించిన 204.85 కోట్ల రూపాయల నిధులకు ఉత్తర్వులను జారీ చేసినట్లు వివరించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో లేడీస్ హాస్టల్ నిర్మాణానికి 80 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని తెలిపారు.
కీలక నిర్ణయాలు ఇవే
- ఉస్మానియా మెడికల్ మెన్స్ హాస్టల్‌కి రూ.50 కోట్లు
- డెంటల్ హాస్టల్‌కి రూ.6 కోట్లు
- బాయ్స్ హాస్టల్ పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.50 లక్షలు
- ఉస్మానియా లేడీస్ హాస్టల్ వద్ద సీసీ రోడ్ల పునరుద్ధరణకు రూ.40 లక్షలు
- మొత్తం ఉస్మానియా వసతి భవంతులు, రోడ్లకు రూ.121.90 కోట్ల విడుదల
- గాంధీ ఆసుపత్రికికి మొత్తం రూ.79.50 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు
- గాంధీ మెడికల్ కాలేజీలో లేడీస్ హాస్టల్ నిర్మాణానికి రూ.42 కోట్లు
- గాంధీ మెన్స్ హాస్టల్ నిర్మాణానికి రూ.23 కోట్లు
- గాంధీలో ఎస్ఆర్ బ్లాక్ హాస్టల్ నిర్మాణానికి రూ.14.50కోట్లు
- కాకతీయ యూనివర్సిటీలో సీసీరోడ్లకు రూ2.75 కోట్లు కేటాయింపు
- మొత్తం ఉస్మానియా, గాంధీ, కాకతీయ వర్సిటీలకు కలిపి రూ.204.85 కోట్లు కేటాయిస్తూ జీవో
Also Read: రౌడీయిజం, హింస, అక్రమాలు కనిపించకూడదు- అధికారులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు