TGPSC Notifications: తెలంగాణ నిరుద్యోగులకు TGPSC అదిరిపోయే న్యూస్.. 102 MPSO, ASO ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC Notifications) రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో MPSO, ASO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Tgpsc notification released for 102 mpso and aso posts in telangana
TGPSC Notifications: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న డిగ్రీ పట్టభద్రులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC Notifications) అదిరిపోయే శుభవార్త అందించింది. రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 102 మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ఏడు జోన్ల పరిధిలో ఈ నియామకాలు చేపట్టనుండగా.. కాళేశ్వరం జోన్లో 12, బాసరలో 14, రాజన్నలో 15, భద్రాద్రిలో 17, యాదాద్రిలో 7, చార్మినార్ జోన్లో అత్యధికంగా 25, జోగులాంబ జోన్లో 12 ఖాళీలు ఉన్నాయి. అక్టోబర్ 30న ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 27, 2026తో ముగియనుంది.
విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు వివరాలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ లేదా కంప్యూటర్ సైన్స్ డిగ్రీలో కనీసం ఒక సంవత్సరమైనా స్టాటిస్టిక్స్ పేపర్ చదివి ఉండాలి. 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది). ప్రాసెసింగ్ ఫీజు కింద సాధారణ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి. నిరుద్యోగ అభ్యర్థులకు రూ.80 పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.
300 మార్కులకు రాత పరీక్ష.. ఆకర్షణీయమైన వేతన శ్రేణి:
2027 జనవరిలో కంప్యూటర్ ఆధారిత (CBRT) లేదా ఓఎంఆర్ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం రెండు పేపర్లు (300 మార్కులు) ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు వేతన శ్రేణితో పాటు ఇతర ప్రభుత్వ అలవెన్సులు లభిస్తాయి.
