WhatsApp Pin Chat : వాట్సాప్‌లో కొత్త పిన్ చాట్ ఫీచర్.. ముఖ్యమైన మెసేజ్‌లను ఈజీగా పిన్ చేసుకోవచ్చు!

WhatsApp Pin Chat : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. చాట్ విండోలో ఇకపై చాట్‌లను పిన్ చేసే సామర్థ్యాన్ని అందిస్తోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?

WhatsApp releases new pin chat feature for everyone, allows users to highlight important messages

WhatsApp Pin Chat : ప్రముఖ మెటా కంపెనీ వాట్సాప్ తమ యూజర్ల కోసం కొత్త పిన్ మెసేజ్ ఫీచర్‌ను ప్రకటించింది. హోమ్ విండోలో చాట్‌లను పిన్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. చాట్ ఎగువన ఒక మెసేజ్ పిన్ చేయడానికి ఈ ఫీచర్ యూజర్లను అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, పీసీ యూజర్లకు ఇప్పుడు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది.

వాట్సాప్ ప్రకారం.. పిన్ చేసిన మెసేజ్‌లు గ్రూప్, వ్యక్తిగత చాట్‌లలో ముఖ్యమైన మెసేజ్‌లను హైలైట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ముఖ్యమైన మెసేజ్‌లను త్వరగా కనుగొనడం ద్వారా యూజర్ల సమయాన్ని ఆదా చేసేందుకు ఈ ఫీచర్ రూపొందించింది. వాట్సాప్ టెక్స్ట్, పోల్స్, ఇమేజ్‌లు, ఎమోజీలు, మరిన్నింటితో సహా అన్ని రకాల మెసేజ్‌లను పిన్ చేయవచ్చు. అంతేకాదు.. చాట్ విండోలోని మెసేజ్‌లన్నీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయని కంపెనీ తెలిపింది.

పిన్ మెసేజ్ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే? :
వాట్సాప్ హోమ్ విండోలో పిన్ చేసిన చాట్‌లు స్టేబుల్‌గా ఉన్నప్పటికీ.. చాట్ పిన్ విండోలో మెసేజ్‌లను ఎంతసేపు పిన్ చేయాలనుకుంటున్నారనే దానిపై టైమ్ ఫ్రేమ్‌ని సెట్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. అధికారిక బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. పిన్ చేసిన మెసేజ్‌లను 24 గంటలు, 7 రోజులు (డిఫాల్ట్) లేదా 30 రోజులు ఉండేలా సెట్ చేయవచ్చు. మీరు వ్యవధిని ఎంచుకోవడానికి పిన్నింగ్ సమయంలో బ్యానర్ కనిపిస్తుంది. గ్రూపు చాట్‌లలో అడ్మిన్‌లు లేదా ప్రతి ఒక్కరూ ఎవరి మెసేజ్‌లను పిన్ చేయవచ్చో కంట్రోల్ చేయొచ్చు.

Read Also : Aadhaar Card Free Update : ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీ అప్‌డేట్ గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటివరకంటే?

మీరు మెసేజ్ మాన్యువల్‌గా అన్‌పిన్ చేయకుంటే.. టైమ్ సెట్ వ్యవధి ముగిసిన తర్వాత దానింతట అదే అన్‌పిన్ అవుతుందని గమనించాలి. అయితే, అన్‌పిన్ చేయడం వల్ల చాట్ ఎగువన ఉన్న బ్యానర్ నుంచి మెసేజ్ డిలీట్ చేస్తే.. అసలు లొకేషన్‌కు తిరిగి వస్తుంది. ఈ విధంగా, మరింత వ్యవస్థీకృత చాట్ ఎక్స్‌పీరియన్స్ కోసం పాత మెసేజ్‌లను డిలీట్ చేసినప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచుకోవచ్చు. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్‌లో మెసేజ్‌లను ఎలా పిన్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ మెసేజ్ పిన్ చేయండి :
* కావలసిన మెసేజ్‌పై ట్యాప్ చేసి పట్టుకోండి.
* మెను నుంచి మరిన్ని ఆప్షన్లను ట్యాప్ చేయండి.
* పిన్ ఎంచుకోండి.
* పిన్ చేసిన మెసేజ్ 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజులు వ్యవధిని ఎంచుకోండి.
* నిర్ధారించడానికి మళ్లీ పిన్ ట్యాప్ చేయండి.
* వాట్సాప్ మెసేజ్ ఐఫోన్ పిన్ చేయండి.

వెబ్, డెస్క్‌టాప్‌లో వాట్సాప్ మెసేజ్ పిన్ చేయండి :
మీరు పిన్ చేయాలనుకునే మెసేజ్ ఎంచుకోండి.
త్రి డాట్స్ ఐకాన్ క్లిక్ చేయండి.
డ్రాప్‌డౌన్ మెను నుంచి పిన్ మెసేజ్ ఎంచుకోండి.
పిన్ చేసిన మెసేజ్ 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజుల వ్యవధిని ఎంచుకోండి.
నిర్ధారించడానికి పిన్ క్లిక్ చేయండి.

వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో మెసేజ్ పిన్ చేయడం ఎలా? :
గ్రూప్ చాట్‌లలో మెసేజ్‌లను ఎవరు పిన్ చేయాలో నిర్ణయించే అధికారం అడ్మిన్‌లకు మాత్రమే ఉంటుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి ఈ కిందివిధంగా ప్రయత్నించండి.

ఆండ్రాయిడ్ : గ్రూప్ చాట్‌ ఓపెన్ చేసి మరిన్ని ఆప్షన్‌లు > గ్రూప్ సెట్టింగ్‌లను ట్యాప్ చేసి, గ్రూప్ సెట్టింగ్‌లలో ఎడిట్ ఆప్షన్ ఆన్ చేయండి.
ఐఫోన్ : గ్రూపు చాట్‌ని ఓపెన్ చేసి గ్రూప్ ఇన్పో > గ్రూప్ సెట్టింగ్‌లు > గ్రూప్ సెట్టింగ్‌లను ఎడిట్ చేసి.. ‘All members’ లేదా ‘Only admins’ని ఎంచుకోండి.
వెబ్/డెస్క్‌టాప్ : గ్రూప్ చాట్‌ని ఓపెన్ చేసి గ్రూప్ ఇన్ఫో > గ్రూప్ సెట్టింగ్‌లు > గ్రూప్ ఇన్పో ఎడిట్ చేయండి క్లిక్ చేయండి. అందులో ‘All members’ లేదా ‘Only admins’ ఎంచుకోండి.

WhatsApp new pin chat feature for everyone 

ఎనేబుల్ చేసిన తర్వాత అనుమతి ఉన్న ఎవరైనా మెసేజ్‌లను పిన్ చేయవచ్చు. సిస్టమ్ మెసేజ్ చాట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి, పిన్ చేసిన వారితో సహా కనిపిస్తుంది. అయితే, పిన్ చేసిన మెసేజ్‌లను వీక్షించడానికి పరిమితులు ఉన్నాయి. మీకు ఇకపై వాట్సాప్ చాట్ ఎగువన పిన్ చేసిన మెసేజ్ అవసరం లేకపోతే వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో మెసేజ్ అన్‌పిన్ చేయొచ్చు.

ఆండ్రాయిడ్ :
పిన్ చేసిన మెసేజ్ ట్యాప్ చేసి పట్టుకోండి.
మెను నుంచి అన్‌పిన్ ఎంచుకోండి.
నిర్ధారించడానికి అన్‌పిన్‌ని మళ్లీ ట్యాప్ చేయండి.

ఐఫోన్ :
పిన్ చేసిన మెసేజ్ ట్యాప్ చేసి పట్టుకోండి.
కనిపించే మెను నుంచి మరిన్ని ఆప్షన్లను ఎంచుకోండి.
అన్‌పిన్‌ని ఎంచుకోండి.
నిర్ధారించడానికి అన్‌పిన్‌ని మళ్లీ ట్యాప్ చేయండి.

వెబ్ – డెస్క్‌టాప్ :
పిన్ చేసిన మెసేజ్‌కు వద్దకు వెళ్లండి.
త్రి డాట్స్ ఐకాన్ క్లిక్ చేయండి.
డ్రాప్‌డౌన్ మెను నుంచి అన్‌పిన్ మెసేజ్ ఎంచుకోండి.
నిర్ధారించడానికి అన్‌పిన్‌ని మళ్లీ క్లిక్ చేయండి.

Read Also : Flipkart Big Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఐఫోన్ 14 నుంచి పిక్సెల్ ఫోన్ల వరకు భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్‌పై ఎంత తగ్గిందంటే?

ట్రెండింగ్ వార్తలు