Aadhaar Card Free Update : ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీ అప్‌డేట్ గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటివరకంటే?

Aadhaar Card Free Update : ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఆధార్ ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు మరో ఛాన్స్.. ఆధార్‌లో తప్పులను సవరించుకునేందుకు గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొత్త డెడ్‌లైన్ ఏంటి? పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Aadhaar Card Free Update : మీ ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకున్నారా? 10ఏళ్లలో ఒకసారైనా అప్‌డేట్ చేశారా? అయితే, మీకు మరో అవకాశం.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) (UIDAI) డిసెంబరు 14 వరకు విధించిన గడువును మళ్లీ పొడిగించింది. అయితే, ఇప్పుడు ఆ తేదీని మార్చి 14, 2024 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త డెడ్‌లైన్ వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా అందరూ తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. (myAadhaar) పోర్టల్ ద్వారా ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. యూఐడీఏఐ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం.. భారతీయ నివాసుల నుంచి వచ్చిన సానుకూల స్పందన ఆధారంగా ఈ ఉచిత సదుపాయాన్ని మరో 3 నెలల పాటు పొడిగించాలని నిర్ణయించింది. అంటే.. డిసెంబర్ 15, 2023 నుంచి మార్చి 14, 2024 వరకు పొడిగించింది.

Read Also : Aadhaar Card Update : 10ఏళ్లలో మీ ఆధార్ వివరాలను అసలు అప్‌డేట్ చేయలేదా? ఈ తేదీవరకే ఉచితం.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

దీని ప్రకారం.. మై ఆధార్ పోర్టల్ ద్వారా డాక్యుమెంట్ అప్‌డేట్ సౌకర్యం ఉచితంగా అందిస్తోంది. అయితే, ఈ సర్వీసు మై ఆధార్ పోర్టల్‌లో మాత్రమే ఉచితంగా అందిస్తోంది. మునుపటి మాదిరిగానే ఫిజికల్ ఆధార్ సెంటర్లలో రూ. 50 రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. గత 10 ఏళ్లలో ఒకసారి కూడా తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయనివారిని తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది.

ఆధార్ సంబంధిత మోసాలను అరికట్టేందుకు ఇలా చేస్తున్నట్టు తెలిపింది. జనాభా సమాచారం నిరంతర కచ్చితత్వం కోసం దయచేసి మీ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే ఆధార్ వివరాల్లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, ఫోన్ నంబర్, ఇమెయిల్ ఐడీ ఉంటాయి. ఫొటో, ఐరిస్ లేదా ఇతర బయోమెట్రిక్ డేటాను కూడా అప్‌డేట్ చేయవచ్చు. కానీ ఫిజికల్ ఆధార్ సెంటర్లలో మాత్రమే చేయడం కుదురుతుందని గమనించాలి.

Aadhaar Card Free Update Last Date

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును అప్‌డేట్ చేయాలంటే? :
ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసేందుకు ఇలా ప్రయత్నించండి.. ఆధార్ కార్డులోని డేటాను అప్‌డేట్ చేయడానికి (myAadhaar) వెబ్‌సైట్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* రిజిస్ట్రేషన్ : యూఐడీఏఐ వెబ్‌సైట్ (myaadhaar.uidai.gov.in)ని విజిట్ చేయండి. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోండి.
* అప్‌డేట్‌ : ‘మై ఆధార్’పై క్లిక్ చేసి.. డ్రాప్-డౌన్ మెనులో ‘Update Your Aadhaar’ ఆప్షన్ ఎంచుకోండి.
* ఆధార్ నంబర్‌ : ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయండి. ఆన్‌లైన్ పేజీలో మీ ఆధార్ క్యాప్చా వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయండి. ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయండి.
* ఓటీపీ అథెంటికేషన్ : మీ రిజిస్టర్డ్ మొబైల్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ‘లాగిన్’ క్లిక్ చేయండి.
* వ్యక్తిగత వివరాలు : మీరు అప్‌డేట్ చేసే జనాభా వివరాలను ఎంచుకోండి. కొత్త డేటాను జాగ్రత్తగా అందించండి.
* ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి ‘పేరు/లింగం/పుట్టిన తేదీ, అడ్రస్ అప్‌డేట్’ బటన్‌ను ఎంచుకుని క్లిక్ చేయండి.
* ఇప్పుడు ‘Update Aadhaar Online’ బటన్‌పై క్లిక్ చేయండి. అవసరమైన మార్పులు చేసిన తర్వాత ‘Submit’ క్లిక్ చేయండి.
* డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి : మీ అప్‌డేట్ వివరాలను వెరిఫై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్‌లను అప్‌లోడ్ చేయండి.
* అప్‌డేట్ రిక్వెస్ట్ : ఈ ప్రాసెస్ పూర్తి చేయడానికి ‘Submit Update Request’ బటన్ క్లిక్ చేయండి.
* ఇప్పుడు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, మార్చి 14, 2024 తర్వాత ఈ అప్‌డేట్ కోసం ఆన్‌లైన్‌లో రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది.
* ట్రాక్ స్టేటస్ : ట్రాకింగ్ బెనిఫిట్స్ కోసం ఎస్ఎంఎస్ ద్వారా అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ని గుర్తుపెట్టుకోండి.
* అప్‌డేట్ స్టేటస్ చెకింగ్ : myaadhaar పోర్టల్ విజిట్ చేసి ‘Check Enrolment & Update Status’పై క్లిక్ చేయండి.
* మీ అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేసేందుకు మీ URNని ఎంటర్ చేయండి.

Read Also : Pan Aadhaar Link : మీ పాన్ కార్డు ఆధార్‌తో లింక్ అయిందో లేదో చెక్ చేయడం తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్

ట్రెండింగ్ వార్తలు