Aadhaar Card Update : 10ఏళ్లలో మీ ఆధార్ వివరాలను అసలు అప్‌డేట్ చేయలేదా? ఈ తేదీవరకే ఉచితం.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

Aadhaar Card Update : యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు ఉచిత ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్‌లను చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి.

Aadhaar Card Update : మీ ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకున్నారా? 10ఏళ్ల వ్యవధిలో ఒకసారి కూడా అప్‌డేట్ చేయలేదా? అయితే, ఇప్పుడే మీ ఆధార్ అప్‌డేట్ చేసుకోండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) డిసెంబరు 14 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ వ్యవధిలో భారతీయ నివాసితులు తమ జనాభా వివరాల్లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వాటిని ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సవరించడానికి అవకాశం ఉంటుంది.

Read Also : PVC Aadhaar Card Online : ఆన్‌లైన్‌లో పీవీసీ ఆధార్ కార్డు ఎలా పొందాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

అయితే, ఆధార్‌లోని అన్ని జనాభా వివరాలను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. ఫొటోగ్రాఫ్, ఐరిస్ లేదా ఇతర బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాల్సిన వారు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ను వ్యక్తిగతంగా సందర్శించి రూ. 50 రుసుమును చెల్లించాలి. బయోమెట్రిక్ అప్‌డేట్‌లకు వేలిముద్రలు, ఐరిస్ నమూనాలు, ఇతర బయోమెట్రిక్ డేటాను స్కాన్ చేయడానికి ఆధార్ కేంద్రాలలో ప్రత్యేక డివైజ్‌లు అవసరం పడుతుంది. అదనంగా, బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియ సమయంలో మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడానికి అవసరమైన ధృవీకరణ విధానాలను కలిగి ఉంది.

ఆధార్ అప్‌డేట్ ఎందుకు తప్పనిసరి :

ఆధార్ నియంత్రణ సంస్థ అయిన యూఐడీఏఐ ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేసింది. డేటా కచ్చితమైనదిగా నిర్ధారించడానికి వీలుంటుంది. ఆధార్ మోసాన్ని ఎదుర్కోవడానికి ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. వివాహం తర్వాత తమ పేరు, చిరునామా వంటి ప్రాథమిక జనాభా వివరాలలో మార్పులు అవసరమని యూఐడీఏఐ పేర్కొంది. అదేవిధంగా, కొత్త ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు చిరునామా, మొబైల్ నంబర్‌లో మార్పులు అవసరం కావచ్చు.

Aadhaar card details

వివాహం లేదా బంధువు ఎవరైనా మరణించినప్పుడు అప్పుడు కూడా అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అదనంగా, నివాసితులు వారి మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్ వంటి సమాచారాన్ని మార్చుకోవచ్చు. రెగ్యులర్ అప్‌డేట్‌లు వివిధ సర్వీసులు, లావాదేవీల కోసం ఆధార్ విశ్వసనీయమైన గుర్తింపుగా పనిచేస్తుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. పిల్లల కోసం బాల ఆధార్ డేటా 15 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలి. అవసరమైన బయోమెట్రిక్ డేటాను కూడా అందించాలి.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును ఎలా అప్‌డేట్ చేయాలి :

ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఈ కిందివిధంగా ప్రయత్నించండి.

* రిజిస్ట్రేషన్ : యూఐడీఏఐ వెబ్‌సైట్ (uidai.gov.in)ని సందర్శించండి. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి.
* అప్‌డేట్‌ : ‘నా ఆధార్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ మెను నుంచి ‘Update Your Aadhaar’ ఎంచుకోండి.
* ఆధార్ నంబర్‌ : ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయండి. ఆన్‌లైన్ పేజీలో మీ ఆధార్ నంబర్ క్యాప్చా ధృవీకరణ కోడ్‌ను ఎంటర్ చేయండి. ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయండి.
* ఓటీపీ అథెంటికేషన్ : అందుకున్న ఓటీపీని ఎంటర్ చేసి ‘లాగిన్’ క్లిక్ చేయండి.
* వివరాలను ఎంచుకోండి : మీరు అప్‌డేట్ చేసే జనాభా వివరాలను ఎంచుకోండి. కొత్త డేటాను జాగ్రత్తగా అందించండి.
* మార్పులు చేయండి : అవసరమైన మార్పులు చేసిన తర్వాత ‘Submit’ క్లిక్ చేయండి.
* డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి : మీ అప్‌డేట్ వివరాలను ధృవీకరించడానికి అవసరమైన డాక్యుమెంట్ స్కాన్‌లను అప్‌లోడ్ చేయండి.
* అప్‌డేట్ రిక్వెస్ట్ : ప్రక్రియను పూర్తి చేయడానికి ‘Submit Update Request’ క్లిక్ చేయండి.
* ట్రాక్ స్టేటస్ : ట్రాకింగ్ బెనిఫిట్స్ కోసం ఎస్ఎంఎస్ ద్వారా అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ని గుర్తుపెట్టుకోండి.
* అప్‌డేట్ స్టేటస్ చెక్ చేయండి: myaadhaar.uidai.gov.in/ని సందర్శించి ‘Check Enrolment & Update Status’పై క్లిక్ చేయండి.
* మీ అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్ వీక్షించడానికి మీ URNని ఎంటర్ చేయండి.

Read Also : Download Aadhaar Card : మీ మొబైల్‌లో ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు