PVC Aadhaar Card Online : ఆన్‌లైన్‌లో పీవీసీ ఆధార్ కార్డు ఎలా పొందాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

PVC Aadhaar Card Online : మీ ఆధార్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో పీవీసీ ఆధార్ కార్డును ఎలా పొందాలో తెలుసా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా నేరుగా మీ ఇంటి వద్దకే పీవీసీ ఆధార్ కార్డును ఆర్డర్ చేసుకోవచ్చు.

PVC Aadhaar Card Online : ఆన్‌లైన్‌లో పీవీసీ ఆధార్ కార్డు ఎలా పొందాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

How to order PVC Aadhaar Card Online

PVC Aadhaar Card Online : ఆధార్ కార్డు.. ఇది ప్రతిఒక్కరి జీవితంలో నిత్యావసరంగా మారింది. వ్యక్తిగత అవసరాల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆధార్ గుర్తింపు కార్డుగా ప్రతిఒక్కరి ఐడెంటిటీని సూచిస్తుంది. అలాంటి ఆధార్ కార్డును ఎలా పొందాలి? అనేది చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. పీవీసీ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో ఈజీగా పొందవచ్చునని మీకు తెలుసా? అందుకే, యూఐడీఏఐ పీవీసీ యూఐడీఏఐ PVC (పాలీవినైల్ క్లోరైడ్) ఆధార్ కార్డ్‌ని ఆర్డర్ చేసే ఆప్షన్ ప్రవేశపెట్టింది.

Read Also : mAadhaar Profile : ఈ ఆధార్ యాప్‌లో మీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!

పీవీసీ ఆధార్ కార్డులు ప్లాస్టిక్‌పై ఫ్రింట్ చేసి ఉంటుంది. ఈ పీవీసీ ఆధార్ కార్డులు ఎక్కువ కాలం మన్నికమైనవిగా ఉంటాయి. ఆధార్ పీవీసీ కార్డ్ అనేది మీ ఆధార్ నంబర్, ఇతర జనాభా సమాచారాన్ని కలిగి ఉండే ఫిజికల్ కార్డ్ అని చెప్పవచ్చు. మీ ఆధార్ నంబర్‌ను మీతో తీసుకెళ్లడానికి వీలుగా ఉంటుంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో అథెంటికేషన్ ప్రయోజనాల కోసం కూడా ఆధార్ ఉపయోగించవచ్చు. పీవీసీ ఆధార్ కార్డును ఆన్‌లైన్ నుంచి ఎలా ఆర్డర్ చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో పీవీసీ ఆధార్ ఆర్డర్ చేయాలంటే? :

1. యూఐడీఏఐ వెబ్‌సైట్‌ని సందర్శించండి లేదా (mAadhaar) యాప్‌ని ఉపయోగించండి.
2. ఇప్పుడు మీ ఆధార్ నంబర్ లేదా (VID)ని ఎంటర్ చేయండి.
3. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
4. ఇప్పుడు, మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.
5. మీ డెలివరీ అడ్రస్ ఎంచుకోండి.
6. ఆ తర్వాత, రూ. 50 రుసుము చెల్లించి రిక్వెస్ట్‌పై క్లిక్ చేయాలి.
7. మీరు ఇప్పుడు యూఐడీఏఐ వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా లేదా ఎంఆధార్ యాప్‌ని ఉపయోగించడం ద్వారా మీ ఆర్డర్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు. ఆర్డర్ చేసిన 15 రోజులలోపు మీ పీవీసీ ఆధార్ కార్డ్ మీ ఇంటికి డెలివరీ అవుతుంది.

How to order PVC Aadhaar Card Online

How to order PVC Aadhaar Card Online

పీవీసీ ఆధార్ కార్డ్‌ని ఆర్డర్ చేసేందుకు మరిన్ని టిప్స్ మీకోసం :

పీవీసీ ఆధార్ ఆర్డర్ చేసే ముందు మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి. మీరు ఆర్డర్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు మీ పేమెంట్ డేటాను రెడీగా ఉంచుకోండి. మీ ఆర్డర్ స్టేటస్ ట్రాక్ చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే మీ ఆధార్ నంబర్, వీఐడీని దగ్గర ఉంచుకోండి.

Read Also : Update Aadhaar Card : ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డ్ ఫొటోను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!