Monkeypox in Children : అమెరికాలో తొలిసారిగా చిన్నారుల్లో మంకీపాక్స్.. ఇద్దరిలో లక్షణాలు..!

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కలకలం సృష్టిస్తోంది. ఇప్పుడు అమెరికాలో చిన్నారుల్లోనూ మంకీపాక్స్ ఆందోళన రేకిత్తిస్తోంది.

Monkeypox in Children : ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కలకలం సృష్టిస్తోంది. ఇప్పుడు అమెరికాలో చిన్నారుల్లోనూ మంకీపాక్స్ ఆందోళన రేకిత్తిస్తోంది. అమెరికాలో మొదటిసారిగా చిన్నారుల్లో ఇద్దరికి మంకీపాక్స్ సోకినట్లు అరోగ్య అధికారులు వెల్లడించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ రిపోర్టు ప్రకారం.. మంకీపాక్స్ వ్యాధి లక్షణాలతో ఇద్దరు చిన్నారులు ఉండగా.. వారిలో ఒకరు కాలిఫోర్నియాకు చెందిన చిన్నారిగా, మరొక చిన్నారి (అమెరికా స్వస్థలం కాదు)గా గుర్తించారు.

ప్రస్తుతం మంకీ పాక్స్ వ్యాధి సోకిన ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ చిన్నారులకు మంకీపాక్స్‌ ఎలా వ్యాపించిందనేది అంతుపట్టడం లేదు.

ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. 2022 ఏడాదిలో దాదాపు 14వేలకు పైగా కేసులు పలు దేశాల్లో నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఐదుగురు ఈ వ్యాధి బారినపడి మృతిచెందారు.

Monkeypox In Children! Us Reports Its First 2 Cases Of Viral Infection In Kids 

అమెరికా, యూరప్‌ దేశాల్లో పురుషుల్లో (homosexual) కారణంగా ఎక్కువ శాతం ఇదే కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ అంటువ్యాధి ఎవరికైనా సోకే ప్రమాదం ఉందని హెల్త్‌ ఆఫీషియల్స్‌ వార్నింగ్ ఇస్తున్నారు. యూరప్‌లో 17ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లల్లో 6 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

గత వారం నెదర్లాండ్స్‌లో బాలుడికి మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించాయి. ఈ వ్యాధి సోకినవారిలో ఎక్కువ చిన్నారులే అధికంగా కనిపిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. మరణాలు, తీవ్రత కూడా అధికంగానే ఉంటుందన్నారు. భారత్ లోకి కూడా మంకీ‌పాక్స్ కేసులు నమోదయ్యాయి. కేరళలో ఇప్పటికే 3 మంకీ‌పాక్స్ కేసులు బయటపడ్డాయి.

Read Also : Monkeypox: దేశంలో పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. కేర‌ళ‌లో మూడ‌వ కేసు న‌మోదు

ట్రెండింగ్ వార్తలు