Viral Video: ఫోన్లకు చార్జింగ్ పెట్టుకోవడం కోసం క్యూ కట్టిన ప్రజలు

డబ్బు మొత్తం యాప్‌ల రూపంలో మొబైళ్లలోనే ఉండడంతో ప్రతి ఒక్కరికీ చార్జింగ్ పెట్టుకోవడం తప్పనిసరిగా మారింది.

ఫోన్లను చార్జింగ్ చేసుకోవడం కోసం ప్రజలు క్యూ కట్టారు. ఈ దారుణ పరిస్థితి చైనాలోని యాగీ తుపాను ప్రభావిత ప్రాంతం హైనాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 6న భారీ వర్షపాతంతో పాటు గంటకు 234 కిలోమీటర్ల వేగంతో ఎన్నడూ లేనంతగా ప్రకృతి వైపరీత్యం సంభవించిన విషయం తెలిసిందే.

దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్తుకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్తును, నీటి సదుపాయాన్ని పునరుద్ధరించలేకపోతున్నారు. దీంతో కనీసం మొబైల్స్‌లో చార్జింగ్ కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక ఇంజన్ ద్వారా మొబైల్ రీచార్జ్ చేసుకునే సదుపాయాన్ని కొందరు వ్యాపారులు కల్పించారు.

డబ్బు మొత్తం యాప్‌ల రూపంలో మొబైళ్లలోనే ఉండడంతో ప్రతి ఒక్కరికీ చార్జింగ్ పెట్టుకోవడం తప్పనిసరిగా మారింది. మొబైల్ ఫోన్లు లేకుండా కనీసం బ్రెడ్డు ముక్కను కూడా వాళ్లు కొనుక్కోలేకపోతున్నారు. దీంతో చార్జింగ్ పెట్టుకోవడం కోసం ప్రైవేటు వ్యాపారులు తీసుకొచ్చిన ఇంజన్‌ను వాడుకోవడానికి రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు.

Also Read: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

ట్రెండింగ్ వార్తలు