×
Ad

Paddy Crop Cultivation : వరి గట్లపై.. లాభాల బాట

Paddy Crop Cultivation : వ్యవసాయంలో ప్రతి ఏటా పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. దిగుబడులు మాత్రం  తగ్గుతన్నాయి. వచ్చిన పంట దిగుబడులకు మార్కెట్ లో ధరలు రావడంలేదు.

  • Published On : September 12, 2024 / 02:22 PM IST

Profits on Rice Fields

Paddy Crop Cultivation : ఆధునిక ప‌ద్ద‌తుల‌తో వ్యవ‌సాయం చేస్తూ దిగుబ‌డి పెంచుకునేందుకు ర‌సాయ‌నాల‌ వినియోగం పెరిగింది. ఇలా పండించిన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, ధాన్యం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నారు. దిగుబడులు తక్కువగా వచ్చినా.. ఆరోగ్యమైన పంట దిగుబడులు తీస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఈ కోవకు చెందిన వారే ఏలూరుకు చెందిన సుంకర రాంబాబు. వరి పొలం గట్లపై పండ్లు, కూరగాయలు పండిస్తూ.. ఆరోగ్యంతో పాటు ఆర్ధిక అభివృద్ధి సాధిస్తున్నారు.

Read Also : Paddy Crop : వరి పొలాల్లో అధికంగా యూరియా వాడుతున్న రైతులు – అవసరం మేరకే వాడాలంటున్న శాస్త్రవేత్తలు

వ్యవసాయంలో ప్రతి ఏటా పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. దిగుబడులు మాత్రం  తగ్గుతన్నాయి. వచ్చిన పంట దిగుబడులకు మార్కెట్ లో ధరలు రావడంలేదు. దీంతో ఆరుగాలం కష్టపడుతున్న అన్నాదాతకు అప్పుల తిప్పలు తప్పడంలేదు.  కాలనికి అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేపడితే.. నష్టాల సేద్యాన్ని లాభాల వైపు నడిపించవచ్చని పలువురు రైతులు నిరూపిస్తున్నారు . ఇలాంటి రైతుల్లో సుంకర రాంబాబు ఒకరు.

పొలంలో ఏదో ఒకే పంటను వేసి.. రసాయనిక ఎరువులు అసలు వాడకుండా పంట పండించడం.. రసాయనిక పురుగుమందులు అసలు చల్లకుండా చీడపీడలను అదుపులో ఉంచడం కత్తి మీద సాము వంటిది. అయితే, పొలం చుట్టూ గట్లపైన కొన్ని రకాల మొక్కలు పెంచి మిత్రపురుగులకు ఆశ్రయం కల్పిస్తే.. సేంద్రియ సేద్యంలోనూ చీడపీడల బెడదను విజయవంతంగా అధిగమించవచ్చు.

దీన్నే నమ్మిన రైతు రాంబాబు తకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో ఎకరంలో దేశీ వరి రకాలను సాగుచేస్తున్నారు. పొలం చుట్టు పెద్ద పెద్ద గట్లను ఏర్పాటు చేసి కూరగాయలు, పండ్లమొక్కలు నాటారు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ… ఆరోగ్యమైన దిగుబడులను తీస్తున్నారు.

పొలం గట్లపై కూరగాయలు పండిస్తూనే.. కొంత విస్తీర్ణంలో పలు పండ్ల రకాలు పండిస్తున్నారు రైతు రాంబాబు . ర‌సాయనాలు లేని కూరగాయలు, పండ్లు, దేశివాళీ వరి పండించడం ద్వారా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం పడద‌ంటున్నారు. కాలానుగుణంగా కోతకు వచ్చే వీటిని ఇంటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ప్రతి రైతు కొంత విస్తీర్ణంలో ఇలాంటి మోడల్ లో పంటలు పండించుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు.

Read Also : Paddy Cultivation : వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారణ