Pakistani Girl : కూతురు భద్రత కోసం తండ్రి వినూత్న ఆలోచన.. వీడియో వైరల్
పాకిస్థాన్ లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజానికి పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల ఆందోళనకూడా పెరుగుతుంది.
- Harishth Thanniru
- Updated on- September 9, 2024 / 12:17 PM IST
CCTV Camera
Pakistani Girl : పాకిస్థాన్ లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజానికి పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల ఆందోళనకూడా పెరుగుతుంది. వారిని తప్పుడు మార్గాల్లోకి వెళ్లకుండా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎటు వెళ్తున్నారు.. కాలేజీకి సరిగా వెళ్తున్నారా? వంటి విషయాలపై ఆరా తీస్తుంటారు. ఇక అమ్మాయిలు అయితే.. వారి రక్షణకోసం తగు జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ తండ్రి తన కూమార్తె బయటకు వెళ్లినప్పుడు ఆమె రక్షణకోసం, దానికితోడు ఆమె ఎటువెళ్తుందో తెలుసుకునేందుకు వినూత్న విధానాన్ని అవలంభిస్తున్నారు. తన కుమార్తె తలపై ఏకంగా సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : Burger House : బర్గర్లతో రూపొందించిన ఏఐ ఇల్లు చూశారా..! వీడియో చూస్తే ఫిదా అవుతారు
పాకిస్థాన్ కు చెందిన ఓ యువతి తలపై సీసీ కెమెరా పెట్టుకొని వీధిలో నడుస్తోంది. ఆమె తలపై సీసీ టీవీ కెమెరా ఉండటాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇందుకు సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అయితే, ఆ యువతి తలపై సీసీటీవీ కెమెరా ఎందుకు ఉంది.. ఎవరు పెట్టారు అనే విషయాలను తెలుసుకునేందుకు మీడియా వ్యక్తులు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ యువతి స్పందిస్తూ.. నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏమి చేస్తున్నానో తెలుసుకోవడానికి మా నాన్న దీన్ని నా తలపై ఇన్ స్టాల్ చేశారు అని చెప్పింది.
Also Read : Jabardasth Avinash : జబర్దస్త్ అవినాష్ వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?
ఇది నాకు సురక్షితం. నా తండ్రి నాకు రక్షకుడు. కరాచీలో దాడులు, హత్యలు, లైంగిక వేధింపులు వంటి ఘటనలు అనేక జరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తుంది. అందుకే నా భద్రత కోసం నా తలపై మా నాన్న సీసీటీవీ కెమెరా అమర్చాడని యువతి చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
next level security pic.twitter.com/PpkJK4cglh
— Dr Gill (@ikpsgill1) September 6, 2024
