Video: వ్యోమగాములతో వెళ్లి, ఎవరూ లేకుండా ఖాళీగా తిరిగి భూమి మీదకు వచ్చిన తొలి వ్యోమనౌక

బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వారు తిరిగి భూమి మీదకు రాలేకపోయారు.

Sunita Williams and Butch Wilmore

సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్‌ను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ఇవాళ తిగిరి భూమికి ఖాళీగా, క్షేమంగా చేరుకుంది. దీంతో అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములతో వెళ్లి, ఎవరూ లేకుండా ఖాళీగా తిరిగి భూమి మీదకు వచ్చిన తొలి వ్యోమనౌకగా బోయింగ్ స్టార్ లైనర్ నిలిచింది.

ఇవాళ ఉదయం 9.30 గంటలకు బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ న్యూమెక్సికోలోని వైట్ సాండ్స్ స్పేస్ హార్బర్‌లో దిగింది. ఆ స్పేస్‌క్ట్రాఫ్ట్ భూమిని చేరుకోవడానికి సుమారు 6 గంటల సమయం పట్టింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వారు తిరిగి భూమి మీదకు రాలేకపోయారు. వారిద్దరిని మళ్లీ సురక్షితంగా భూమి మీదకు ఎలా తీసుకురావాలన్నదానిపై నాసా ప్రణాళికలు వేసుకుంది.

స్టార్‌లైనర్‌ వ్యోమనౌక ద్వారా వారిద్దరు రావడం సురక్షితం కాకపోతే వారిని స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తీసుకొస్తామని ఇప్పటికే నాసా అధికారులు తెలిపారు. ఇందుకోసం స్పేస్ ఎక్స్‌తో కలిసి నాసా పనిచేస్తోంది. క్రూ 9 ద్వారా వారిద్దరిని తీసుకువచ్చే ప్రణాళికలనూ సిద్ధం చేసి పెట్టుకున్నారు.

 

Also Read: తన ప్రాణం పోయినా ఇల్లు విడిచి పెట్టనన్న వాణి.. ఆ ప్రాపర్టీ తనదన్న మాధురి

ట్రెండింగ్ వార్తలు