లేటు వయస్సులో : ప్రగతి పర్‌ఫార్మెన్స్ పీక్స్ అండీ బాబూ..

  • Publish Date - June 1, 2020 / 05:03 AM IST

టాలీవుడ్ లో సీనియర్ నటులు తమ ఫెర్మామెన్స్ తో అభిమానులను పిచ్చెక్కిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు బంద్ అయిపోయాయి. హీరోలు, హీరోయిన్స్, ఇతర నటులు అందరూ ఇంటికే పరిమితం అయిపోయారు. తమలో ఉన్న టాలెంట్ ను బయటకు తీసి..వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

సీనియర్ నటి ‘ప్రగతి’ తల్లిగా, వదినగా, పిన్నిగా అనేక క్యారెక్టర్స్ లలో అలరించారు.  ఈమె లేటెస్ట్ గా పోస్టు చేసిన వీడియో.. వయసుదేముంది.. రిథమ్ ఉండాలి కానీ, అనేట్లు ఉంది. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేసి.. తనకంటూ స్పెషాలిటీ సంపాదించుకున్నారు ప్రగతి. సోషల్ మీడియా యాక్టివ్ ఉంటారు. ఈ మధ్యే కొడుకుతో కలిసి తీన్‌మార్ స్టెప్స్ వేసింది.

పక్కా మాస్ మసాలా స్టైల్లో లుంగీ పైకి కట్టి ప్రగతి వేసిన ఊరమాస్ మూమెంట్స్ చూసి అభిమానులు అవాక్కయ్యారు. తాజాగా మరో వీడియో రిలీజ్ చేశారు. మ్యూజిక్ తగ్గట్టు..నడుము ఊపుతూ చేసిన ఈమె చేసిన డ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియోకు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వయస్సులో కూడా సూపర్బ్ డ్యాన్స్ అంటున్నారు. 

 

Read: అవకాశాలు రావాలంటే ‘సర్దుకు’పోవాలంట..లైంగిక వేధింపుల వల్లనే నటనకు దూరమయ్యా.

ట్రెండింగ్ వార్తలు