నీలి చిత్రాలు చూపించి అత్యాచారం, జైల్లో హక్కుల కార్యకర్తకు నరకం చూపించారు

Harassment On Loujain al Hathloul: 1001 రోజులు.. అంటే దాదాపు మూడేళ్లు.. ఆమె జైల్లో గడిపారు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటో తెలుసా.. మహిళల హక్కుల కోసం పోరాడడమే. మహిళలకూ కారు నడిపే హక్కులివ్వాలన్నది ఆమె డిమాండ్. అదే ఆమె పాలిట శాపమైంది. జైలుకి వెళ్లేలా చేసింది. చివరికి ఆమెకి విముక్తి లభించింది. జైలు నుంచి విడుదల అయ్యింది.

దాదాపు మూడేళ్లు నిర్బంధంలో ఉన్న ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త లౌజైన్ అల్ హత్లౌల్ (31)ను(Loujain al-Hathloul) సౌదీ అధికారులు విడుదల చేశారు. మహిళా డ్రైవర్లపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ దీర్ఘకాలంగా పోరాడుతున్న లౌజైన్ సహా 12మంది మహిళలను 2018 మేలో అరెస్ట్‌ చేశారు. అనూహ్యంగా సౌదీలో మహిళా డ్రైవర్లపై నిషేధాన్ని ఎత్తివేస్తూ చారిత్రక నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయం రావడానికి కొన్ని వారాల ముందే పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసిన లౌజైన్ కు కోర్టు దాదాపు ఆరేళ్ల జైలుశిక్ష విధించింది.

అయితే ఆమె నిర్భంధంపై ఐక్యరాజ్యసమితి, ప్రపంచ మానవ హక్కుల సంఘాలు ఖండించాయి. ఆమెను వెంటనే విడుదల చేయాల్సిందిగా సౌదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపధ్యంలో రెండేళ్ల పది నెలల శిక్షా కాలన్ని తగ్గిస్తున్నట్లు 2020 మార్చిలో కోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఆమె త్వరలోనే విడుదలవుతారంటూ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. చివరికి వెయ్యి రోజుల జైలు శిక్ష తర్వాత లౌజైన్ విడుదలయ్యారు.

ఇకపోతే జైల్లో తాను అనుభవించిన నరకాన్ని లౌజైన్ గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతం అయ్యారు. జైల్లో పలుమార్లు తనపై అత్యాచారం జరిగిందన్నారు. ఇంటరాగేషన్ సమయంలో నీలిచిత్రాలు చూపించి అత్యాచారం చేశారని, చాలామంది లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు తనను బలవంతంగా ముద్దుపెట్టుకున్నారని చెప్పారు. అలా మూడేళ్లు పాటు జైల్లో పోలీసులు తనకు నరకం చూపారని వాపోయారు.

జైల్లో ఉన్న లౌజైన్ పై పలువురు అత్యాచారానికి పాల్పడ్డారని మానవ హక్కుల న్యాయవాది కెన్నడీ ఇటీవల ఓ లేఖ రాశారు. విచారణ సమయంలో పోలీసులు ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకుని, సీలింగ్ కు వేలాడదీసి దారుణంగా కొట్టి, విద్యుత్ షాక్ కూడా ఇచ్చి హింసించారని లేఖలో తెలిపారు. ఇంటరాగేషన్ సమయంలో అధికారులు తీవ్రంగా వేధించారని, ఆమెతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నారని చెప్పారు. జైల్లో ఉన్న మూడేళ్లు.. లౌజైన్ పై అత్యాచారం జరిగిందని, లైంగికంగా వేధించారని కెన్నడీ ఆరోపించారు.

సౌదీ రాజకీయ వ్యవస్థలో మార్పు, జాతీయ భద్రతకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొన్న లౌజైన్ విడుదల కోసం ఆమె కుటుంబ సభ్యులు సుదీర్ఘ పోరాటమే చేశారు. ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సౌదీపై అమెరికా సహా పలు దేశాలు ఒత్తిడి పెంచాయి. మానవ హక్కులను కాలరాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయంగా సౌదీపై ఒత్తిడి ఎక్కువైంది. దీంతో గురువారం(ఫిబ్రవరి 11,2021) ఆమెను సౌదీ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది.

ఈ విషయాన్ని ఆమె సోదరి లీనా అల్ హత్లౌల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 1001 రోజుల తర్వాత లౌజైన్ ఇల్లు చేరిందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పై మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఇదివరకే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఆమెను విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. మంచి పని చేశారంటూ వ్యాఖ్యానించారు. అసలు ఆమెను జైలుకు పంపించి ఉండాల్సింది కాదంటూ అమెరికా విదేశాంగ శాఖ చెప్పింది.

పురుషుడు లేకుండా మహిళలు ఒంటరిగా కారులో ఎందుకు ప్రయాణం చేయకూడదు అని లౌజైన్ పలుమార్లు ప్రశ్నించారు. మహిళలకు వ్యతిరేకంగా ఉన్న సౌదీ చట్టాలపై 2014లో తొలిసారిగా తన గళం వినిపించారు. అంతేకాదు యూఏఈ వరకు ఒంటరిగా కారుని డ్రైవ్ చేస్తూ లైవ్ లో స్ట్రీమ్ చేస్తూ ప్రయాణం చేశారు.

ట్రెండింగ్ వార్తలు