Gold Rate : బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold And Silver Price : తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించింది. ఆదివారం బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, గత నెలలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధర.. మే నెల ప్రారంభం నుంచి హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ ధర మే, జూన్ నెలల్లో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,850 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.71,830 వద్దకు చేరింది.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,000 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 71,980.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.65,850 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 71,830.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,000 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.72,000.

 

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.86,500 వద్ద కొనసాగుతుంది
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 86,500.
    కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.83,000
    బెంగళూరులో కిలో వెండి ధర రూ. 82,600.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

 

ట్రెండింగ్ వార్తలు