IPL 2024 : లక్నో జట్టుకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు దూరమైన ఫాస్ట్ బౌలర్.. అసలేం జరిగిందంటే?

బుల్లెట్ బంతులతో ఐపీఎల్ 2024 సీజన్ లోనే అత్యంత వేగవంతమైన బౌలర్ గా గుర్తింపు పొందిన లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్

Mayank Yadav : బుల్లెట్ బంతులతో ఐపీఎల్ 2024 సీజన్ లోనే అత్యంత వేగవంతమైన బౌలర్ గా గుర్తింపు పొందిన లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న అతన మిగిలిన మ్యాచ్ లలో ఆడే పరిస్థితి లేదని కోచ్ జస్టిస్ లాంగర్ క్లారిటీ ఇచ్చాడు. అతను మాట్లాడుతూ.. మయాంక్ రాబోయే మ్యాచ్ లలో ఆడాలని ప్రార్ధిస్తాం. ప్లేఆఫ్ లో ఆడతాడని భావించినప్పటికీ.. ఇప్పడు అతనున్న పరిస్థితుల్లో టోర్నీలో మిగిలిన మ్యాచ్ లు ఆడతాడని అనుకోవటం లేదని లాంగర్ చెప్పాడు.

Also Read : IPL 2024 : ఆర్సీబీ దెబ్బకు పాయింట్ల పట్టికలో కిందకు వెళ్లిపోయిన మూడు జట్లు

ఐపీఎల్ లో ప్లేఆఫ్ కు చేరుకునేందుకు లక్నో జట్టు తీవ్రంగా శ్రమిస్తుంది. ఆ జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్ లు ఆడగా.. ఆరు విజయాలు, 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడు స్థానంలో ఉంది. మరో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. రెండు మ్యాచ్ లలో విజయం సాధించినా ఆ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం ఉంది. అయితే, కీలక సమయంలో మయాంక్ యాదవ్ జట్టుకు దూరం కావడం లక్నోకు గట్టి దెబ్బ అని చెప్పొచ్చు.

Also Read : IPL 2024 : అక్కడుంది కింగ్ కోహ్లీ.. అయినా పరుగు తీస్తావా..! ఫలితం ఇలానే ఉంటది మరి.. వీడియో వైరల్

21ఏళ్ల మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2024 సీజన్లో అత్యంత వేగవంతమైన బంతులు వేసిన బౌలర్ గా పేరుపొందాడు. ఈ సీజన్ ప్రారంభంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో మయాంక్ గంటకు 156.7 కిలో మీటర్ల వేగంతో బంతిని వేశాడు. ఈ సీజన్ లో తొలి రెండు మ్యాచ్ లలో మయాంక్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రెండు మ్యాచ్ లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. రెండో మ్యాచ్ లో గాయం కారణంగా తరువాతి ఐదు మ్యాచ్ లకు మయాంక్ దూరమయ్యాడు. అతను కోలుకొని ముంబైతో మ్యాచ్ లో మళ్లీ బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్ లో నాలుగో ఓవర్లో ఒక బంతి వేయగానే గాయం తిరగబెట్టడంతో మైదానం వీడాడు. అయితే, లక్నో జట్టు ప్లే ఆఫ్స్ కు చేరితే మయాంక్ అందుబాటులో ఉంటాడని భావించినప్పటికీ.. ఆ అవకాశం లేదని కోచ్ జస్టిన్ లాంగన్ క్లారిటీ ఇచ్చాడు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు