IPL 2024 : అక్కడుంది కింగ్ కోహ్లీ.. అయినా పరుగు తీస్తావా..! ఫలితం ఇలానే ఉంటది మరి.. వీడియో వైరల్

విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024 టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. 11 మ్యాచ్ లలో 73.57 సగటుతో 515 పరుగులు చేసిన కోహ్లీ..

IPL 2024 : అక్కడుంది కింగ్ కోహ్లీ.. అయినా పరుగు తీస్తావా..! ఫలితం ఇలానే ఉంటది మరి.. వీడియో వైరల్

Virat Kohli

IPL 2024 RCB vs GT : ఐపీఎల్ 2024లో భాగంగా ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం (మే4) గుజరాత్ టైటాన్స్‌ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 19.3 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్), కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్) రాణించడంతో ఆర్సీబీ 13.4 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో నాలుగు వికెట్ల తేడాతో వరుసగా మూడో విజయాన్ని ఆర్సీబీ జట్టు అందుకుంది. ఫలితంగా ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Also Read : IPL 2024 : డుప్లెసిస్ వీరబాదుడు.. దడ పుట్టించిన బెంగళూరు.. గుజరాత్ విలవిల!

ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ షారుక్ ఖాన్ రన్ తీసే క్రమంలో విరాట్ కోహ్లీ డైరెక్ట్ త్రో వేసి రనౌట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. 13ఓవర్ కొనసాగుతుంది. ఆర్సీబీ తరపున మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఓవర్లో నాల్గో బంతికి క్రీజులో ఉన్న రాహుల్ తెవాటియా కోహ్లీ వైపు బాల్ స్ట్రైట్ గా కొట్టాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో నిలబడిన షారుక్ ఖాన్ పరుగు తీసేందుకు ప్రయత్నించి పిచ్ సగ భాగానికి చేరుకున్నాడు. అప్పటికే బంతి విరాట్ కోహ్లీ చేతిలోకి వెళ్లింది. కోహ్లీ చేతిలోకి బాల్ వెళ్లిందని తెలుసుకొని షారుక్ ఖాన్ తిరిగి వెనక్కి పరుగు తీశాడు. ఈలోపు కోహ్లీ అద్భుతమైన ప్రతిభతో నేరుగా వికెట్లకు బంతిని విసరడంతో షారూక్ ఖాన్ రనౌట్ కాక తప్పలేదు. షారూక్ ఖాన్ అవుట్ కాగానే కోహ్లీ ప్లయింగ్ కిస్ లు ఇస్తూ కనిపించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కోహ్లీ చేతిలోకి బాల్ వెళ్లిన తరువాత కూడా పరుగుకు వెళ్లడం నీతప్పే బ్రో అంటూ షారూక్ ఖాన్ కు సూచిస్తూ కామెంట్లు చేస్తున్నారు. షారుక్ ఖాన్ రనౌట్ అయిన సమయంకు 24 బంతుల్లో 37 పరుగులు చేశాడు.

Also Read : IPL 2024 : చిన్నస్వామి స్టేడియంలో హర్లీన్ డియోల్‌కు బ్యాటింగ్ చిట్కాలు చెప్పిన శుభ్‌మాన్ గిల్.. వీడియో వైరల్

విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024 టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. 11 మ్యాచ్ లలో 73.57 సగటుతో 515 పరుగులు చేసిన కోహ్లీ.. ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రెండో స్థానంలో ఉన్నాడు. అతను 10 మ్యాచ్ లలో 63.62 సగటుతో 509 పరుగులు చేశాడు.